వస్తు సేవల పన్ను, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన రెండు రోజుల సమ్మెతో సోమవారం హైదరాబాద్‌లో సుమారు ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు, వివిధ రకాల ముడిసరుకు రవాణాకు బ్రేక్ పడింది. ఆదివారం అర్ధరాత్రి వరకు బుకింగ్‌లు చేసుకుని రోడ్డెక్కిన లారీలు మినహా మిగతావన్నీ ఆగిపోయాయి. వస్తువుల లోడింగ్, అన్‌లోడింగ్‌లను కూడా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, జనరల్‌బజార్, మోండా, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. అత్యవసర వస్తువులు మినహా ఇతర అన్ని రకాల వస్తువుల సరఫరాను లారీ సంఘాలు అడ్డుకున్నాయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుండడంతో కొన్ని రకాల వస్తువుల ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
5 వేల లారీలకు బ్రేక్
Published Tue, Oct 10 2017 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement