GST approval
-
ఉద్యోగాలేవీ?: రాహుల్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’అనే నినాదంతో కాంగ్రెస్ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాహుల్... మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఎందుకిలా జరిగింది? తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’అని రాహుల్ ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. అందుకే యూత్ కాంగ్రెస్ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్ కాంగ్రెస్ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి: శశిథరూర్ పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ రాహుల్ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్ ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. తాత్కాలిక సారథిగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. రాహుల్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొంత కాలం సోనియా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం సోమవారంతో ముగిసినా మరికొంతకాలం ఆమె పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తెలిపారు. సమీప భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. -
జీఎస్టీ 2.0 అమల్లోకి తేవాలి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2–3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. ‘జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్టీ 2.0ని అమలు చేయాల్సిన తరుణం వచ్చింది. ఇది దేశ ఎకానమీని తదుపరి వృద్ధి స్థాయికి చేర్చగలదు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ప్రారంభ దశలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించిన నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ పేర్కొన్నారు. మరోవైపు రిటర్నుల ఫైలింగ్ల్లోనూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ల్లోనూ వ్యత్యాసాలు ఉన్నా, పన్నులు ఎగవేసినా ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, ప్రొప్రైటర్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు. దీనివల్ల తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే వారు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేక జీఎస్టీ వ్యవస్థను రూపొందించినట్లు కుమార్ చెప్పారు. ఐటీసీ క్లెయిమ్‌లు, రిటర్నుల్లో తేడాలున్న పక్షంలో ఆయా అసెసీలకు అలర్ట్‌లు పంపడంతో పాటు ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీఆర్–3బి దాఖలు చేయని సంస్థలకు ఆగస్టు 22 నుంచి ఈ–వే బిల్లుల జారీ నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.22 కోట్ల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదయ్యాయి. -
ఆర్థిక వ్యవస్థను బాగుచేస్తాం
న్యూఢిల్లీ: నోట్లరద్దు, అస్తవ్యస్తంగా జీఎస్టీని అమలు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు బీజేపీ ప్రభుత్వం కలిగించిన నష్టాన్ని తాము న్యాయ్ (కనీస ఆదాయ భద్రత పథకం) ద్వారా పూడుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న తరుణంలో పీటీఐకి రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము ప్రకటించిన న్యాయ్ పథకానికి రెండు లక్ష్యాలు ఉన్నాయనీ, వాటిలో ఒకటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందివ్వడం కాగా, రెండోది ప్రధాని మోదీ ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను బాగుచేయడమని రాహుల్ చెప్పారు. కనీస ఆదాయ భద్రత పథకానికి తాము న్యాయ్ (న్యూన్‌తమ్ ఆయ్ యోజన) అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందనీ, గత ఐదేళ్లలో మోదీ ప్రజలకు అన్యాయం చేయగా, మేం న్యాయం చేస్తామని చెప్పడానికే ఆ పేరు పెట్టామని తెలిపారు. ప్రజాకర్షక పథకం కాదిది న్యాయ్ పథకం ప్రజలను కాంగ్రెస్ వైపునకు ఆకర్షించేందుకు తీసుకొచ్చింది కాదనీ, పేదరికంపై చివరి అస్త్రమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ అమలు విధానం నిర్ణయాల్లా ఇది అస్తవ్యస్తంగా ఉండదనీ, ఒక పద్ధతి ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, అప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించిన అనంతరం దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. మూడేళ్లదాకా అనుమతులు అక్కర్లేదు కొత్తగా ప్రారంభమైన వ్యాపార సంస్థలు తొలి మూడేళ్ల కాలంలో ఏ రకమైన అనుమతినీ ప్రభుత్వం నుంచి పొందాల్సిన అవసరం లేకుండా చేస్తామని రాహుల్ హామీనిచ్చారు. స్టార్టప్ కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులపై విధిస్తున్న ఏంజెల్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాయనేదాని ఆధారంగా వారికి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఉంటాయని రాహుల్ తెలిపారు. వచ్చే వారంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. -
5 వేల లారీలకు బ్రేక్
-
5 వేల లారీలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన రెండు రోజుల సమ్మెతో సోమవారం హైదరాబాద్‌లో సుమారు ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు, వివిధ రకాల ముడిసరుకు రవాణాకు బ్రేక్ పడింది. ఆదివారం అర్ధరాత్రి వరకు బుకింగ్‌లు చేసుకుని రోడ్డెక్కిన లారీలు మినహా మిగతావన్నీ ఆగిపోయాయి. వస్తువుల లోడింగ్, అన్‌లోడింగ్‌లను కూడా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, జనరల్‌బజార్, మోండా, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. అత్యవసర వస్తువులు మినహా ఇతర అన్ని రకాల వస్తువుల సరఫరాను లారీ సంఘాలు అడ్డుకున్నాయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుండడంతో కొన్ని రకాల వస్తువుల ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని కూకట్పల్లి, మూసారాంబాగ్, ఎల్బీనగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో లారీ యాజమాన్య సంఘాలు ఆందోళనకు దిగాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆల్ ఇండియా మోటారు ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్స్ అసోసియేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల లారీ సమ్మెలో భాగంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లో సమ్మెకు దిగింది. విజయవాడ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో లారీ యాజమాన్య సంఘాల ప్రతినిధులు, ఓనర్లు పాల్గొని నిరసన తెలిపారు. ఆగిపోయిన 90 శాతం బుకింగ్‌లు.. సరుకు రవాణా రంగంలో సుమారు 2 లక్షల లారీలు రాకపోకలు సాగిస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ సుమారు 5,000 లారీల ద్వారా వివిధ రకాల వస్తువులు నగరానికి ఎగుమతి, దిగుమతి అవుతాయి. కూరగాయలు, పాలు, మందులు, పెట్రోల్, డీజిల్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులు మినహా మిగిలిన వస్తువుల ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. లారీ బుకింగ్ కార్యాలయాలను మూసివేశారు. ఎలాంటి ఆర్డర్లను స్వీకరించలేదు. 90 శాతం మేర బుకింగ్‌లు ఆగిపోయినట్లు రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ వంటి మార్కెట్లలో బంద్ కారణంగా స్తబ్దత నెలకొంది. జీఎస్టీ దెబ్బకు కుదేలు.. జీఎస్టీ ప్రభావంతో రవాణా రంగం కుదేలైందని, చాలామంది లారీ యజమానులు ఆర్డర్లు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి రుణగ్రస్తులుగా మారారన్నారు. జీఎస్టీ దెబ్బతో వస్తు రవాణా కోసం వర్తకులే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. రోజూ డీజిల్ ధరలను సవరించే కారణంతో ధరలను అమాంతంగా పెంచేస్తున్నారన్నారు. టోల్‌ట్యాక్స్ నుంచి లారీలకు మినహాయింపునివ్వాలని, పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లను అరికట్టాలని, ఓవర్‌లోడు పేరుతో డ్రైవర్ల లైసెన్సులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. కేటీఆర్ సానుకూల స్పందన మంత్రి కేటీఆర్‌తో సోమవారం తమ సమస్యలపై చర్చలు జరిపినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. జీఎస్టీ ప్రభావం, ఇంధన ధరల పెంపు తదితర అంశాలపైన కేంద్రంతో సంప్రదించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. నేడు కూడా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. -
చిన్న, మధ్యస్థాయి వర్తకులకు ఊరట
న్యూఢిల్లీ: మూడు నెలల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా జీఎస్టీపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో జీఎస్టీని సులభతరం చేస్తూ పలు సవరణలు చేసింది. వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లను తగ్గించింది. జీఎస్టీలో పన్ను చెల్లింపులు, రిటర్ను దాఖలు విధివిధానాలు క్లిష్టంగా ఉన్నాయంటూ చిన్న, మధ్యస్థాయి వర్తకులు వాపోతున్న నేపథ్యంలో వారికి ఊరట కలిగించేలా ఆయా విధానాలను కూడా సరళీకరిస్తూ శుక్రవారం జరిగిన 22వ భేటీలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఎగుమతిదారులకు కూడా నిబంధనలను సడలించింది. మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. దేశంలో పరోక్ష పన్ను వ్యవస్థను సమూలంగా మార్చివేస్తూ ప్రభుత్వం జూలై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. గత మూడు నెలల్లో ఎదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై నవంబరు 9న జరిగే మండలి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ మండలి నిర్ణయాలు ► రూ.కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఇకపై ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్నును చెల్లించడంతోపాటు, రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనివల్ల 90 శాతం వ్యాపారులకు ఊరట కలగనుంది. ► ఇప్పటి వరకు రూ.75 లక్షల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలను కాంపోజిషన్ పథకంలో చేరేందుకు అనుమతిస్తుండగా, తాజాగా ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు. కాంపోజిషన్ పథకంలో ఉన్న వర్తకులు మూడు నెలలకోసారి తమ పన్నులు చెల్లించి, రిటర్నులు దాఖలు చేయవచ్చు. వివరంగా రికార్డులను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటివరకు 90 లక్షల మంది వర్తకులు జీఎస్టీ కింద నమోదు చేసుకోగా వారిలో 15 లక్షల మంది కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకున్నారు. ► ఎగుమతిదారులు జూలై నెలలో ఎగుమతులకు సంబంధించి చేసిన పన్ను చెల్లింపులకు సంబంధించిన రీఫండ్‌ను అక్టోబరు 10లోపు, ఆగస్టు నెల ఎగుమతులకు రీఫండ్‌ను అక్టోబరు 18లోపు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఎగుమతిదారులను మినహాయింపు పొందిన వర్గంగా పరిగణిస్తారు. వారు తాత్కాలికంగా నామమాత్రపు 0.1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. 2018 ఏప్రిల్ 1 కల్లా ఎగుమతిదారుల కోసం ఈ– వాలెట్ ప్రారంభించి మూలధన సమస్య రాకుండా చూస్తుంది. ► భవిష్యత్తులో పన్ను రేట్లను ఏ ప్రాతిపదికన సవరించాలనే దానిపై ఓ నిర్దేశ పత్రాన్ని రూపొందించారు. ► రెస్టారెంట్లపై పన్నులను హేతుబద్ధీకరించడం, అంతర్రాష్ట్ర అమ్మకాల వర్తకులకు కూడా కాంపోజిషన్ పథకం సౌకర్యం కల్పించడంపై అధ్యయనం చేసే బాధ్యతలు మంత్రివర్గ బృందానికి అప్పగించారు. సాధారణంగా కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్న వర్తకులకు ఇన్పుట్ క్రెడిట్ రాదు. ఈ పథకం కింద ప్రస్తుతం రెండు శాతం పన్ను చెల్లిస్తున్న తయారీదారులు ఇన్పుట్ క్రెడిట్ పొందే అవకాశం ఉంటుందా అన్న విషయాన్ని కూడా మంత్రివర్గ బృందం అధ్యయనం చేస్తుంది. జీఎస్టీ మరింత సులభతరం: మోదీ తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలతో వస్తుసేవల పన్ను చెల్లింపు మరింత సులభతరం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్లో తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్టీని ఆయన గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్‌గా మరోసారి అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రజలకు లబ్ధి చేకూర్చడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. వేర్వేరు వర్గాలతో విస్తృతంగా సంప్రదించి జీఎస్టీలో మార్పులు చేపట్టిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆయన బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. జైట్లీ తాజా సిఫార్సుల వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తులకు లబ్ధి కలుగుతుందని మోదీ పేర్కొన్నారు. కాంపోజీషన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామనీ, కేంద్రం ప్రస్తుత చర్యలతో జీఎస్టీ మరింత సమర్థవంతంగా తయారవుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది : కాంగ్రెస్ జీఎస్టీలో మార్పులు చేపట్టడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన కాంగ్రెస్.. ఈ సిఫార్సులు సామాన్య ప్రజలకు అత్యల్ప లబ్ధిని మాత్రమే చేకూరుస్తాయని పేర్కొంది. తప్పుడు నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం దేశ జీడీపీని అదనంగా 2% పెంచే అవకాశాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు వస్తువు పాత పన్నురేటు సవరించిన రేటు బ్రాండెడ్ కాని నమ్కీన్ 12 శాతం 5 శాతం ఆయుర్వేద ఔషధాలు 12 శాతం 5 శాతం ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు 12 శాతం 5 శాతం గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రసిద్ధి పొందిన ఖాఖ్రా ఆహార పదార్థం 12 శాతం 5 శాతం సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ఆహార పొట్లాలు 12 శాతం 5 శాతం చేతివృత్తులైన జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్ 12 శాతం 5 శాతం ఎక్కువ మంది కార్మికులు అవసరమయ్యే ప్రభుత్వ కాంట్రాక్టులు 12 శాతం 5 శాతం యంత్రాలతోకాకుండామనుషులుతయారుచేసేనూలు 18శాతం 12 శాతం స్టేషనరీ వస్తువులు 18 శాతం 12 శాతం గ్రానైట్, మార్బుల్ మినహా నేలపై పరచడానికి ఉపయోగించే బండలు 18 శాతం 12 శాతం నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు 28 శాతం 18 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) 28 శాతం 5 శాతం -
రూ.100 కోట్లపైనే జీఎస్టీకి టోకరా!
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో ఇప్పటికే ఆదాయాన్ని కోల్పోతున్న సర్కారుకు చాలా మంది వ్యాపారులు మరింత నష్టాన్ని కలగజేస్తున్నారు. పండుగల సీజన్ లావాదేవీల్లో మాయాజాలం ప్రదర్శిస్తూ యథే చ్ఛగా పన్ను ఎగ్గొడుతున్నారు. ఇంత జరుగు తున్నా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారు లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకుండా చోద్యం చూస్తున్నారు. ఇందుకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ఈ పండుగల సీజన్లో బట్టల వ్యాపారం కనీసం రూ. 1,200 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన కనీసం రూ. 100 కోట్లకుపైగానే జీఎస్టీ సర్కారు ఖజానాకు చేరాల్సి ఉన్నా ఆ మేరకు వ్యాపారులు ఎగవేసినట్లు తెలుస్తోంది. కేంద్రం భయం.. రాష్ట్రాలకు అశనిపాతం వాస్తవానికి జీఎస్టీ అమల్లోకి వచ్చాక కనీసం 3 నెలలపాటు వ్యాపారుల జోలికి వెళ్లవద్దని.. తనిఖీలు, పన్ను వసూళ్ల పేరుతో వేధించొద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రాష్ట్రాలు వ్యాపారులను ఇబ్బంది పెడితే వారు ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేస్తారని, దాని వల్ల ప్రజలపై భారం పడుతుందని పేర్కొంది. అయితే వ్యాపారుల నుంచి జీఎస్టీని ముక్కు పిండి వసూలు చేస్తే వ్యాపార వర్గాల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే భయం తోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని మండిప డుతున్నాయి. ఇప్పుడు ఇదే నిర్ణయం తమకు అశనిపాతంగా మారిపోతోందని వాపో తున్నాయి. కనీసం చెక్‌పోస్టులు లేకపోవడంతో ఏ సరుకులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి.. ఏ గోదాముల్లో పెడుతున్నారు.. సరుకులు వస్తున్నాయా లేదా అనే విషయాలు కూడా రాష్ట్ర పన్నులశాఖతోపాటు సెంట్రల్ ఎక్సైజ్‌కు తెలియడం లేదు. దీంతోపాటు వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ఏం జరుగుతుందని పరిశీలించే అవకాశం కూడా పన్నులశాఖ అధికారులకు లేకుండా పోయింది. బిల్లుల్లో పన్నుల ప్రస్తావన మాయం... దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రాష్ట్రంలో ఏటా పెద్ద ఎత్తున బట్టల కొనుగోళ్లు జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని బడా బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్ గత వారం రోజులుగా కిటకిటలాడుతూనే ఉన్నాయి. జీఎస్టీ ప్రకారం ప్రతి రూ. 1,000లోపు కొనుగోళ్లపై 5 శాతం, ఆపైన జరిపే కొనుగోళ్లపై వినియోగదారులు 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యాపారులు ప్రతి లావాదేవీకీ బిల్లు ఇచ్చి అందులోనే పన్నులను కూడా ప్రస్తావించాలి. కానీ చాలా మంది వ్యాపారులు ‘తెలివి’గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో జరిగే వ్యాపార లావాదేవీలకు బిల్లులిచ్చినా చాలా చోట్ల పన్ను అంశాన్నే ప్రస్తావించడం లేదు. కొన్ని షాపింగ్ మాల్స్ మాత్రం బిల్లు కింది భాగంలో ‘దిసీజ్ ఎస్టిమేషన్.. ప్యాకింగ్ స్లిప్.. నాట్ ఫైనల్ ఇన్వాయిస్’ అని రాయడం ద్వారా బిల్లుపై జీఎస్టీ ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్న కూడా తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే బిల్లుల్లేవు, జీఎస్టీ లేదన్న రీతిలోనే వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇలా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ అందులో పదో, పరకో ప్రభుత్వానికి పన్ను చెల్లిద్దామనే కోణంలో వ్యాపారులు వ్యవహరిస్తున్నా కనీసం పట్టించుకునే నాథుడు కూడా లేకపోవడం గమనార్హం. ఇంకా వ్యాట్ పనుల్లోనే సిబ్బంది... జీఎస్టీ వ్యవహారాలకన్నా అంతకుముందు వరకు అమల్లో ఉన్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్)లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో పన్నులశాఖలోని కిందిస్థాయి సిబ్బంది వ్యాట్ డీలర్ల ఆడిటింగ్, స్క్రూటినీ లాంటి పనులకే పరిమితమయ్యారు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారని పన్నులశాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ దశలోనూ వ్యాపారులను అడిగే అవకాశం కాదు కదా... కనీసం సమన్వయం చేసే పరిస్థితి కూడా లేకపోవడం దారుణమని, గతంలో ఎప్పుడూ ఇంత విచ్చలవిడి వ్యాపార లావాదేవీలు జరగలేదని వాణిజ్య పన్నులశాఖలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. సరైన పరిస్థితులుంటే దసరా, దీపావళి పండుగల సీజన్లో కనీసం రూ. 200 కోట్ల పన్నులు జమ అయ్యేవని వ్యాఖ్యానించారు. -
దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ‘ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ’ పేరుతో ఆయన రాసిన వ్యాసం ప్రచురితమైంది. ‘పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూశానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారు. ఆ పేదరికాన్ని భారతీయులందరూ కూడా దగ్గర నుంచి చూసేలా చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహర్నిశలు శ్రమిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. రంగాల వారీగా ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని విమర్శించారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయని ఆరోపించారు. పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా నాశనమైందని పేర్కొన్నారు. ‘వ్యవసాయం పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇక నిర్మాణ రంగం మందకొడిగా సాగుతోంది. సేవల రంగంలో స్తబ్దత నెలకొంది. ఎగుమతులు క్షీణించాయి’ అని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కోలుకోలేని ఆర్థిక విపత్తుగా యశ్వంత్ సిన్హా అభివర్ణించారు. భారీగా ఊహించుకుని, ఘోరంగా అమలు పరిచారంటూ జీఎస్టీ అమలును దుయ్యబట్టారు. ఈ నిర్ణయాల వల్ల వ్యాపార రంగం తీవ్రంగా నాశనమైందన్నారు. వృద్ధి రేటు రానురాను తగ్గిపోతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.7 శాతానికి చేరుకుందని వెల్లడించారు. ‘నా వ్యాఖ్యలతో బీజేపీలోని చాలామంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు. కానీ ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. భారతీయుడిగా నా బాధ్యతను విస్మరించినట్లే’ అని పేర్కొన్నారు. ప్రపంచానికి తెలుసు: రాజ్‌నాథ్ యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఈ నిజాన్ని ఎవరూ మరిచిపోకూడదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ విశ్వసనీయత సంపాదించుకుంది’ అని స్పష్టం చేశారు. 18 నెలలుగా ఇదే చెబుతున్నాం..: చిదంబరం దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతుంటే ప్రభుత్వం తమ నోరు మూయిస్తూ వచ్చిందని, గత 18 నెలలుగా కాంగ్రెస్ చెబుతున్న దాన్నే యశ్వంత్ సిన్హా తన వ్యాసంలో చెప్పారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ‘నినాదాల’తో ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. ‘యశ్వంత్ సిన్హా నిజం మాట్లాడారు. దీనిపై మేం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా అభిప్రాయాలు ఆయన ద్వారా ప్రతిధ్వనించాయి’ అని వ్యాఖ్యానించారు.Criticisms -
అవినీతిపై రాజీలేని పోరు
న్యూఢిల్లీ: అవినీతిపై తమది రాజీలేని పోరాటమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అవినీతి విషయంలో తనకు బంధువులు ఎవరూ లేరన్న ప్రధాని.. అవినీతిపరులైన నాయకులెవరినీ వదలబోమని హెచ్చరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వంటి సంప్రదాయ రాజకీయ విధానాల స్థాయి నుంచి పార్టీ ఎదగాలి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలకు అతీతంగా చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచాలి. ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే దిశగా కృషి చేయాలి’ అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాలకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు ఉపముఖ్యమంత్రులు, 60 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అవినీతి, పేదరికం, కులతత్వం, మతతత్వం, ఉగ్రవాదాల అంతమే లక్ష్యంగా పేర్కొంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. మోదీ ప్రసంగ వివరాల్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. ‘రాజకీయాలు ప్రజల జీవితాల్ని బాగుచేయాలి. పేదల సంక్షేమం కోసం పాటుపడాలి. ఎన్నికలకు అతీతంగా బీజేపీని బలోపేతం చేయాలి. అభివృద్ధిని ఆ పార్టీ విశ్వసిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాద నిరోధం, నల్లధనంపై చర్యలు, డోక్లాం వివాద పరిష్కారంపై ఆయన మాట్లాడారు. ఎలాంటి గందరగోళం లేకుండానే డోక్లాం సమస్య పరిష్కారమైందని, ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ఉగ్రపోరు కొనసాగుతుందని చెప్పారు. ‘అవినీతిపై పోరులో రాజీపడేది లేదు. అవినీతిపరులు ఎవరినీ విడిచిపెట్టం. అవినీతి విషయంలో నాకెవరూ బంధువులు లేరు’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును తప్పుపడుతూ.. సరైన ఆధారాలు లేకుండా.. పరుషమైన ఆరోపణలు చేస్తున్నారని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అధికారాన్ని అనుభవించడమే లక్ష్యంగా పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వ్యవహరించిందని, ఇప్పుడు ప్రతిపక్షంగా ఎలా ఉండాలో తెలియడం లేదని తప్పుపట్టారు. మూడేళ్లుగా ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉందని, కేవలం గత మూడు నెలలుగా తగ్గుదల కన్పిస్తోందని, ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. పనితీరునే బీజేపీ నమ్ముకుంది: అమిత్ షా అంతకుముందు కార్యవర్గ భేటీని ప్రారంభిస్తూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. రాజకీయాల్లో పనితీరును బీజేపీ నమ్ముకుంటే.. కాంగ్రెస్ మాత్రం బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాలపై ఆధారపడిందని విమర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ సాధారణ కుటుంబం నుంచి వచ్చినా వారి కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. ఆరు సూత్రాల ఎజెండాకు ఆమోదం 2022 నాటికి నవభారతాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను నిజం చేసేందుకు పేదరికం, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం, అవినీతిని రూపుమాపడం లక్ష్యంగా పేర్కొంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని కార్యవర్గ భేటీ ఆమోదించింది. సమావేశ తీర్మాన వివరాల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడిస్తూ.. స్వచ్ఛ భారత్ కూడా ఆ ఎజెండాలో భాగమని చెప్పారు. ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనల్ని నివృత్తి చేయాలని కోరడంతో పాటు జీఎస్టీ అమలును, నోట్ల రద్దును తీర్మానంలో పార్టీ ప్రశంసించిందని తెలిపారు. తీర్మానంలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► రోహింగ్యా సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి మద్దతు. దేశంలోని 125 కోట్ల ప్రజల భద్రత విషయంలో రాజీపడకూడదు. ► ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ప్రయత్నాన్ని అడ్డుకోవడంపై ఆవేదన.. ఈ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధిస్తుందని ఆశాభావం.. ► అవినీతి, నల్లధనంపై చేసిన వాగ్దానాల్ని ప్రభుత్వం నిలబెట్టుకుంది. పారదర్శక ఆర్థిక వ్యవస్థకు నోట్ల రద్దు బాటలు వేసింది. జీఎస్టీ అమలు ప్రశంసనీయం. ► డోక్లాం వివాద పరిష్కారంతో పాటు ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్త ప్రచారం, పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల గుట్టును బహిర్గతం చేయడంలో ప్రధాని మోదీ కృషి అమోఘం. ► మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ► బీజేపీ కార్యకర్తలపై హింసను తీర్మానంలో ఖండించిన కార్యవర్గ భేటీ.. కేరళ, పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలపై దాడుల్ని ప్రస్తావించారు. -
గతవారం బిజినెస్
నియామకాలు ⇔ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్ 24 నుంచి ఐదేళ్ల పదవీ కాలంలో కొనసాగడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ⇔ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా రాణి సింగ్ నాయర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ⇔ మైక్రోసాఫ్ట్’ ఇండియా ప్రెసిడెంట్‌గా అనంత్ మహేశ్వరి ఎంపికయ్యారు. ఈయన మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ నుంచి 2017 జనవరి 1 నుంచి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జీఎస్టీకి ఆమోదం దేశంలో ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. దీనిపై పరిశ్రమ వర్గాలు, పన్ను నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. జీడీపీపై సానుకూల ప్రభావం ఉంటుందని, ఆర్థిక రంగ వృద్ధికి తోడ్పడుతుందని, వస్తు, సేవల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, నల్లధనానికి కళ్లెం వేస్తుందని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. లాఇకో ‘సూపర్3’ సిరీస్ టీవీలు చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘లాఇకో’ తాజాగా తన ‘సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ‘ఎక్స్55’, 65 అంగుళాల ‘ఎక్స్65’, 65 అంగుళాల ‘మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్డీ (3840‘2160) రెజల్యూషన్ వీటి సొంతం. ‘ఎక్స్55’ ధర రూ.59,790గా, ‘ఎక్స్65’ ధర రూ.99,790గా, ‘మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. వోకార్డ్‌కు యూఎస్ఎఫ్డీఏ మరో పంచ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తాజాగా ఫార్మా దిగ్గజం ‘వోకార్డ్’కు మరో షాకిచ్చింది. ఈ సంస్థకు చెందిన మరో ప్లాంటు ఔషధాల దిగుమతులపై నిషేధం విధించింది. వోకార్డ్ తన అంకలేశ్వర్ ప్లాంటులో తయారీ నిబంధనలు అతిక్రమించిందని, తదనుగుణంగానే అక్కడ త యారైన ఔషధాల దిగుమతిపై నిషేధం విధిస్తున్నామని యూఎస్ఎఫ్డీఏ తన వెబ్సైట్లో పేర్కొంది. 8వ ఏడాదీ ముకేశ్ అంబానీ వేతనం రూ.15 కోట్లు భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు. ఆమోదిత మొత్తం రూ.38.75 కోట్లు అయినా... రూ.15 కోట్లను ఆయన తీసుకున్నట్లు 2015-16 వార్షిక నివేదికలో ఆర్ఐఎల్ తెలిపింది. సంస్థ బోర్డ్‌లోని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల వేతనం భారీగా పెరుగుతున్నా... ముకేశ్ తన నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. టాప్-10 కార్పొరేట్ గ్రూప్‌ల రుణం 5 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఈ ఏడాది మార్చి నాటికి టాప్ 10 కార్పొరేట్ గ్రూపులు చెల్లించాల్సిన రుణ మొత్తం రూ.5.73 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ చౌక గృహ రుణాలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా చౌక గృహ రుణాలను ప్రకటించింది. ఏడవ వేతన కమిషన్ వల్ల ప్రయోజనం పొందిన రక్షణ సహా ఇతర రంగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు బ్యాంకు ఈ రుణాలను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్’, రక్షణ రంగ ఉద్యోగులకు ‘ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్’ అనే రెండు రకాల గృహ రుణాలను ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలియజేసింది. ఈ రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజూ ఉండ దని, రుణ గ్రహీతలు 75 ఏళ్లు వచ్చే వరకు రీ-పేమెంట్ (ఈఎంఐ) చెల్లించవచ్చని పేర్కొంది. బీఈఎల్ షేర్ల బైబ్యాక్ రక్షణ రంగ ప్రభుత్వ దిగ్గజ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) రూ.2,171 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయనుంది. 1.66 కోట్ల షేర్లను షేర్‌కు రూ.1,305 చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు బీఎస్ఈకి పంపిన సమాచారంలో తెలిపింది. బీఈఎల్‌లో ప్రభుత్వ వాటా 75.02 శాతం. తాజా బైబ్యాక్ ద్వారా ప్రభుత్వానికి కొంత మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. ఏడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే ప్రభుత్వం రూ.300 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిల్లో రూ.267 కోట్ల విలువైన టికోన డిజిటల్ నెట్వర్క్స్ ప్రతిపాదన ప్రధానమైనది. లారస్ ల్యాబ్స్ ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ఐదు ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ తిరస్కరించింది. మరో ఏడింటిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఫైనాన్షియల్ టైమ్స్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్ మార్కెట్స్, మెర్గాన్ స్టాన్లీ ఇండియా ప్రైమర్ డీలర్ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. డీల్స్.. ⇔ హైదరాబాద్ కేంద్రంగా పునరుత్పాదక రంగంలో సేవలందిస్తున్న మిత్ర వాయు (ఎంవీటీపీఎల్) 31 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఏపీలో 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకుగాను గుయామా పీఆర్ హోల్డింగ్స్ ఈ పెట్టుబడులు పెట్టిందని మిత్ర ఎనర్జీ తెలిపింది. ⇔ ఇజ్రాయెల్‌కు చెందిన క్లౌడ్ కంపెనీ క్లౌడిన్లో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.27 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ⇔ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్(డబ్ల్యూపీఎన్) కంపెనీ ఇజ్రాయెల్‌కు చెందిన హెచ్ ఆర్ గివోన్ను కొనుగోలు చేయనున్నది.