అనంతపురంలో జన్మభూమి-మీ ఊరు కార్యక్రమం శనివారం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని వృద్ధులు, వికలాంగులు నిలదీశారు.మరోవైపు గార్లపెంటలో జన్మభూమి-మీ ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అధికారులను వృద్ధులు, వితంతులు అడ్డుకున్నారు. అర్హులైన తమను జాబితా నుంచి ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published Sat, Oct 4 2014 12:53 PM | Last Updated on Thu, Mar 21 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement