గల్ఫ్ ఆఫ్ మర్తబాన్ ప్రాంతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.