కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించగానే నల్లధనం కుబేరుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. బ్యాంకులలో నగదు మార్చుకోవచ్చని చెప్పినా, 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసేవారిపై ఒక కన్ను వేసి ఉంచుతామని హెచ్చరించడంతో.. కట్టలకొద్దీ నోట్లను ఏం చేయాలో తెలియలేదు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు గుట్టల కొద్దీ 500, 1000 రూపాయల నోట్లను రోడ్డు మీద వేసి, కాల్చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఒక కంపెనీ ఉద్యోగులు పర్సాఖేడా రోడ్డులోకి ఈ నోట్లను బస్తాలలో తీసుకొచ్చి పారేశారని కొందరు అంటున్నారు. నోట్లను సగానికి కత్తిరించి, పాడుచేసి మరీ ఇక్కడకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, రిజర్వు బ్యాంకుకు సమాచారం అందించారు.
Published Thu, Nov 10 2016 9:46 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM