భూములు రైతులవి... పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వానిది, అంటే ప్రజలదే... అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేది మాత్రం సింగపూర్ ప్రైవేట్ సంస్థలు. ఆ రూ.వేల కోట్లలో కొంత సొమ్ము ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి కమీషన్ల రూపంలో వెళ్లనుంది. అంతిమంగా నష్టపోయేది రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, ప్రజలే. పాలకులు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు ఫణంగా పెడుతున్నారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా(1,691 ఎకరాలు) అభివృద్ధి పేరిట భారీ దోపిడీకి సర్కారు పెద్దలు, సింగపూర్ కంపెనీలు ఉమ్మడిగా తెరతీశాయి. ప్రభుత్వం ఏ పనికైనా టెండర్లను ఆహ్వానిస్తే తానే నిబంధనలను, షరతులను విధించడం పరిపాటి. అయితే ఇక్కడ సింగపూర్ సంస్థలే రాష్ట్ర ప్రభుత్వానికి షరతులను విధించాయి. ప్రభుత్వం వాటిని గుడ్డిగా ఆమోదించేసింది. సింగపూర్ సంస్థలకు పూర్తిగా దాసోహమంది.
Published Wed, Jul 20 2016 6:58 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement