ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ డిమాం డ్ చేశారు. శనివారం ఇక్కడ ప్రధాన కార్యదర్శి డి.హనుమంతుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి సీపీఎస్ అమలు చేస్తున్నారని, ప్రమాదవశాత్తు మర ణిస్తే ఈ పథకం కింద ఆర్థిక భరోసా లేదని చెప్పారు.