సీఎం తనయుడైతే కాళ్లు పట్టుకుంటారా? | shame less Ministers in AP: jogi ramesh | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 10 2016 4:15 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

తెలంగాణ ప్రభుత్వం ద్వారా హైదరాబాద్‌లో నల్లధనం మార్పిడి జరిగిందని, రూ.10 వేలకోట్లు మార్పిడి జరిగితే అదంతా కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొల్లు కబుర్లు చెబుతున్నారని రమేష్ మండిపడ్డారు. నీకుగానీ, మీ నాయకుడు చంద్రబాబుకు దమ్ముంటే.. ఆ డబ్బు జగన్‌మోహన్‌రెడ్డిదేనని నిరూపించే సత్తా ఉంటే ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు. మీరే కేంద్రంలోనూ,. రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నారు. నీకు నిరూపించే ధైర్యం ఉంటే ఆ డబ్బంతా నీకో, నీపార్టీకో, అధినేత చంద్రబాబుకో రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. విజయవాడ నగరంలో ఏ సెంటర్‌లోనైనా సరే పాత్రికేయుల సమక్షంలో చర్చకు రావాలని కోరారు. నిరూపించలేకపోతే నీవేం చేస్తావో చెప్పు అని ఉమాను నిలదీశారు. నల్లధనం మార్చుకునేందుకు నియమనిబంధనలు ఉంటాయన్న విషయం తెలియకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement