రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఉదయం వేళల్లో చలి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మరో రెండ్రోజులపాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి పూట మేఘాలు కేంద్రీకృతమై ఉంటున్నా.. రాత్రి వేళ సాధారణ పరిస్థితి ఉంటుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు తగ్గారుు. మెదక్, నల్లగొండల్లో 6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గారుు. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా 10 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు నమోదైంది. నగరంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు తగ్గారుు.