ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో తెలుగు ఎంపీలు గళమెత్తారు. ప్రాంతాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ముక్తకంఠంతో నినదించారు. విభజన చట్టంలోని హామీలకు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపీకి ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో పలువురు తెలుగు ఎంపీలు మాట్లాడారు.