Thota Seetharama Lakshmi
-
రాజ్యసభలో గళమెత్తిన తెలుగు ఎంపీలు
-
రాజ్యసభలో గళమెత్తిన తెలుగు ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో తెలుగు ఎంపీలు గళమెత్తారు. ప్రాంతాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ముక్తకంఠంతో నినదించారు. విభజన చట్టంలోని హామీలకు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపీకి ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో పలువురు తెలుగు ఎంపీలు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నాడు ప్రధాని ఇచ్చిన హామీని గౌరవించాలని కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరకపోతే మరో కేటగిరి పెట్టి న్యాయం చేయాలని ఆయన సూచించారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలుగువారందరూ కోరుకుంటున్నారని టీడీపీ ఎంపీ తోటా సీతామహాలక్ష్మి చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులే బీజేపీ చేయొద్దని మరో ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. తాము ఎప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించలేదని, ఏపీకి న్యాయం చేయాలని కోరామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విభజన జరిగిన తీరును వ్యతిరేకించామని చెప్పారు. కాగా, టి. సుబ్బిరామిరెడ్డికి రాజ్యసభ వైస్ చైర్మన్ పీజే కురియన్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. -
రాష్ట్రానికి ప్రత్యేక నిధులివ్వండి
రాజ్యసభలో ఎంపీ సీతారామలక్ష్మి ఏలూరు, భీమవరం : రాష్ట్రంలోని పలు సమస్యలపై రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గురువారం చర్చించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబుపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా ఉందన్నారు. రైతుల సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో వారికి అండగా నిలిచేందుకు చంద్రబాబు రుణమాఫీని అమలు చేసి వారిని ఆదుకున్నారన్నారు. అయితే రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని, ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక రైల్వేజోన్, రాజధాని ఏర్పాటు, కార్పొరేట్ ఆసుపత్రుల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రం గురించి అన్ని విధాలుగా తెలిసిన కేంద్రమంత్రులు ఎం.వె ంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయ నిధుల విడుదల చేయడానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. -
చైతన్యరాజును గెలిపించండి
రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి బాలాజీచెరువు(కాకినాడ) :ఉపాధ్యాయులంతా ఏకతాటిపై నిలిచి ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజును గెలిపించాలని రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ, ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు)తో కలిసి ఆమె సోమవారం భీమవరం పట్టణం, పరిసర గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం అభ్యర్థి చైతన్యరాజును గెలిపించాలని కోరారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిందని ఎంపీ తెలిపారు. అనంతరం చైతన్యరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒత్తిడిలేని విద్యావిధానం అమలవుతోందని చెప్పారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకూ త్వరలో హెల్త్‌కార్డులు ప్రభుత్వం ఇవ్వనున్నదని తెలిపారు. అలాగే మహిళా ఉపాధ్యాయులకు రెండేళ్లపాటు చైల్డ్‌కేర్ లీవ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. అలాగే డీసీఈబీ పునరుద్ధరణతోపాటు, పాఠశాలల పనివేళలు మార్పుతోపాటు భాషాపండితులు, పీఈటీల పదోన్నతికి అడ్డంగా ఉన్న జీవో 11,12ను సవరించడం వంటి అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో తాను సఫలీకృతుడనయ్యానన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భీమవరం మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ చైతన్యరాజును అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఎంపీ సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సీహెచ్.రామానుజయ, చైతన్యరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.సూర్యనారాయణరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు మెంటె పార్థసారథి, రాఘురామరాజు, గాదిరాజు సత్యనారాయణ, ఇందుకూరి రామలింగరాజు, బర్రె నెహూ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, డీఎన్ఆర్ గవర్నింగ్‌బాడీ సభ్యుడు గోకరాజు నరసింహరాజు, మెంటే గోపి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు చలమలశెట్టి రామానుజయ ఉన్నారు. చైతన్యరాజు తనయుల విస్తృత ప్రచారం చైతన్యరాజు తనయులు రవికిరణ్‌వర్మ, శశికిరణ్‌వర్మ తండ్రి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. రవికిరణ్ వర్మ ఉప్పలగుప్తం,అమాలాపురం మండలాల్లో పర్యటించి ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించారు. గైట్ ఎండీ శశికిరణ్‌వర్మ రాజమండ్రి, రాజమండ్రి రూరల్ మండలాల్లో పర్యటించి ఉపాధ్యాయుల మద్దతు కోరారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
భీమవరం : గోదావరి వరదకు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆదివారం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పర్యటించి వచ్చిన అనంతరం వారు భీమవరంలో ఎంపీ తోట సీతారామలక్ష్మి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వరదల కారణంగా పంట పొలాలు మునిగి దెబ్బతిన్నాయని వాటిని చూసి చలించిపోయానని చెప్పారు. బాధితులందరికీ ప్రభుత్వం పరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు. వరద బాధితులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ పంపిణీ చేసినట్టు చెప్పారు. సమావేశంలో మంత్రి సుజాత మాట్లాడుతూ జిల్లాలోని పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గోదావరి తీర ప్రాంతంలో వరద నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. పోలవరం నియోజకవర్గంలో పొగాకు, అరటి తోటలు, ఆచంట, పాలకొల్లు ప్రాంతాల్లో అరటి, తమలపాకు, కొబ్బరి, వరి పొలాలు దెబ్బతిన్నాయన్నారు. వీటి నష్టాన్ని అంచనా వేసి నివేదించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. త్వరలో అధికారులు బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయన్నారు. సమావేశంలో విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, గన్ని వీరాంజనేయులు, మెంటే పార్ధసారథి, భీమవరం మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.