రాష్ట్రంలోని పలు సమస్యలపై రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభలో జరిగిన బడ్జెట్
రాజ్యసభలో ఎంపీ సీతారామలక్ష్మి
ఏలూరు, భీమవరం : రాష్ట్రంలోని పలు సమస్యలపై రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గురువారం చర్చించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబుపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా ఉందన్నారు. రైతుల సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో వారికి అండగా నిలిచేందుకు చంద్రబాబు రుణమాఫీని అమలు చేసి వారిని ఆదుకున్నారన్నారు. అయితే రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని, ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక రైల్వేజోన్, రాజధాని ఏర్పాటు, కార్పొరేట్ ఆసుపత్రుల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రం గురించి అన్ని విధాలుగా తెలిసిన కేంద్రమంత్రులు ఎం.వె ంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయ నిధుల విడుదల చేయడానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.