కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో దుర్మరణం చెందారు. ముదినేపల్లికి చెందిన వల్లభనేని హరీష్ (42) అమెరికాలోని పిట్స్‌బర్గ్ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. బయటకు వెళ్లేందుకు కారు స్టార్ట్ చేయబోతే అది స్టార్ట్ కాలేదని, దాంతో ముందుకు వెళ్లి బోనెట్ ఎత్తి చూస్తుండగా.. ముందు అంతా బాగా డౌన్ ఉండటంతో కారు ఒక్కసారిగా ముందుకు దూకిందని.. దాంతో కారు అతడి ఛాతీ మీదుగా వెళ్లి చనిపోయాడని సమాచారం అందింది.