పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. పెషావర్‌లోని ఓ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లోకి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు వేసుకుని స్కూల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... టీచర్లు, విద్యార్థులను బందించి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనలో సుమారు 20మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా స్కూల్‌ను చుట్టుముట్టిన సైన్యంపై ఉగ్రవాదులు పాఠశాల లోపలి నుంచే కాల్పులు జరుపుతున్నారు. ఇక కాల్పులకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. మొత్తం 500 మంది విద్యార్ధులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తుంది. కాల్పులు కొనసాగుతున్నాయి.
Published Tue, Dec 16 2014 1:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement