అక్రమ కట్టడాలు, లే అవుట్లు ఉన్న వారికి శుభవార్త. వాటి క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)తో పాటు లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్) ప్రవేశపెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు.