: గిన్నీస్ బుక్ రికార్డు సాధనలో భాగంగా ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో సాధన చేస్తున్న కానిస్టేబుల్ ఉమామహేశ్వర్రావు గుండెపోటుతో మృతిచెందాడు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి ఆదివారం కృష్ణానదిలో చేతులకు కాళ్లకు తాళ్లు కట్టుకొని ఈత సాధన చేస్తున్న ఉమామహేశ్వర్రావు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.