పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు మొదటికే మోసం తెస్తున్నాయి. ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎలా ఉన్నా.... వాళ్లు లేవనెత్తుతున్న ప్రశ్నలు పార్టీ మనుగడకు సవాల్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ సమక్షంలో టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఎంతో మంది ఎమ్మెల్యేల అనర్హతతో రికార్డు సృష్టించిన 13వ శాసనసభలో గంగుల కమలాకర్ అనర్హత పిటిషన్ అరుదైన కేసు కాబోతోంది. అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా గంగుల కమలాకర్ లేవనెత్తిన వాదనలు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. 2009 ఎన్నికల్లోనే తెలంగాణకు అనుకూలమనే నినాదంతో TDP, TRS కలిసి పనిచేసిన విషయాన్ని కమలాకర్ గుర్తు చేస్తున్నారు. TRS కండువాతోనే ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు TRSతో మాట్లాడితే పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంతాలపరంగా తానెప్పుడు పక్కదోవ పట్టలేదని..... మారింది టీడీపీ విధానమేనని అంటున్నారు. ఇదే విషయాన్ని స్పీకర్ దృష్టికి తెచ్చారు.
Published Wed, Jul 3 2013 10:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:01 AM
Advertisement
Advertisement
Advertisement