4 గంటలు దీక్ష చేశారా? ఎప్పుడైనా 8 రోజులు సీఎం దీక్ష చేశారా? | when did cm kiran kumar reddy fasted for eight consecutive days asks ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 5 2014 8:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు గంటలు దీక్ష చేశాడా? అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశాడు. ఎప్పుడన్నా ఎనిమిది రోజులు అన్నం తినకుండా దీక్ష చేశాడా అనే విషయాన్ని కిరణ్ అడిగి తెలుసుకోండి. సమైక్య రాష్ట్రం కోసం తాను ఎనిమిది రోజులు కడుపు మాడ్చుకుని దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు ఎలాంటి బీపీ, షుగర్ లేవని.. కేసీఆర్, చంద్రబాబులకు షుగర్ ఉన్నాయి. సీఎం కిరణ్ దీక్ష చేయలేదు. తనతోపాటు 36 గంటలు దీక్ష చేయమని చెప్పండి.. షుగర్ ఉన్న పేషంట్ 36 గంటలు దీక్ష చేస్తే... అప్పుడు తెలుస్తుంది దీక్షల సంగతి అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ భేటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకలు వైఎస్ జగన్ వెంట ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement