అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చకు మరో మూడు వారాల గడువు పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిరణ్ మంగళవారం ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చను ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని ప్రణబ్కు రాసిన లేఖలో కిరణ్ ఆరోపించారు. దీని వల్ల సమయం వృథా అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టి.బిల్లు గడువు పొడిగించాలని ప్రణబ్కు విజ్ఞప్తి చేశారు.
Published Tue, Jan 28 2014 5:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement