పైడిపాలెం రిజర్వాయర్‌ను వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పరిశీలించారు. పైడిపాలెం రిజర్వాయర్‌లో 80 శాతం పనులు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, అంతా తానే చేశానంటూ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెడితే ఈ పాటికి రాయలసీమ సస్యశ్యామలమయ్యేదని తెలిపారు. చంద్రబాబుకు ప్రాజెక్టులపై కంటే.. కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే ఆసక్తి ఎక్కువని మండిపడ్డారు. ప్రాజెక్టులపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు.