పైడిపాలెం రిజర్వాయర్ వద్దకు వెళుతున్న వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పైడిపాలెం జలాశయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కోవరంగట్టుపల్లి వద్ద అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని గృహనిర‍్భంధం చేసేందుకు ప్రయత్నించారు. రిజర్వాయర్ వద్దకు వెళ్లకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.