ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఫీజు పోరు దీక్షా ప్రాంగణం వద్ద రోజా శుక్రవారం మాట్లాడారు. విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కిరణ్ సర్కార్ ఆర్పివేస్తుందని రోజా ధ్వజమెత్తారు. పేదవాడి కన్నీరు కత్తి కంటే పదునైనదని... అది ప్రభుత్వానికి శాపంగా మారుతుందని అన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లను కూడా ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. విద్యార్థులతో పాటు వారి కుటుంబాల్లో మార్పు తెచ్చే మంచి పథకాన్ని ఆశీర్వదించకుండా... అరకొర నిధులతో చేతులు దులుపుకోవటం దారుణమని అన్నారు. అవసరం అయిన వాటికి నిధులు కేటాయించని సర్కార్ అడ్డగోలుగా ప్రజలపై పన్నులు భారం మోపుతుందని రోజా వ్యాఖ్యానించారు.
Published Fri, Jul 19 2013 3:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement