మరోసారి ఆస్ట్రేలియా విశ్వ విజేతగా అవతరించింది. క్రికెట్ లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ ఆసీస్ ఐదోసారి వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ ను కైవశం చేసుకుంది. న్యూజిలాండ్ విసిరిన 184 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్ గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(45)పరుగులతో ఆకట్టుకున్నాడు. వార్నర్ వెనుదిరిగిన అనంతరం స్టీవ్ స్మిత్ కు జత కలిసిన మైకేల్ క్లార్క్ బాధ్యతాయుతంగా ఆడాడు.