చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ లో ఫాస్ట్ పిచ్ లు కావడంతో పాటు జట్టును సమతుల్యంగా ఉంచేందుకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులో ఉంచి, అశ్విన్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు.