ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మరోసారి ఆనందంతో హోరెత్తింది... మూడేళ్ల వ్యవధిలో మళ్లీ ఆ వేదిక పండగ చేసుకొంది... తమ ఇంటి బిడ్డ వింబుల్డన్ విజయంతో పులకించిపోయింది. సొంతగడ్డపై బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సగర్వంగా రెండోసారి ట్రోఫీని అందుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ కరవు తీర్చుకుంటూ మూడో టైటిల్‌తో మురిశాడు. సెమీస్‌లో ఫెడరర్‌ని పడగొట్టిన రోనిచ్ తుది పోరులో మాత్రం ఆండీకి తలవంచాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రోనిచ్‌ను ఓడించి ముర్రే తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు