కరోనా వైపరీత్యాన ఎంతోమంది ఉపాధి కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్నారు. సినీ నటులకు లాక్‌డౌన్ కష్టాలు తప్పలేదు. తాజాగా నటుడు జావేద్ హైదర్ పని లేకపోవడంతో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బిగ్‌బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌టాక్‌లో షేర్ చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అతడికి ఉపాధి కరువైంది. దీంతో విధి లేక పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాడంటూ ఆమె పేర్కొంది. ఈ వీడియోలో అతడు కూరగాయల బండి ముందు టమాటాలు అమ్ముతూ ఓ హిందీ వీడియోకు లిప్‌సింక్ ఇచ్చాడు.
దీనికి మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి. "ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ మరో మార్గాన్ని ఎంచుకుని జీవించడం గ్రేట్", "అతని మంచి పని చేస్తున్నాడు. జీవితంలో ఆశ కోల్పోకూడదనడానికి ఇది ఉదాహరణ" అని టిక్‌టాక్ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. కాగా అతడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ప్రవేశించాడు. అమీర్‌ఖాన్ 'గులాం', 'లైఫ్ కీ ఐసీ కి తైసి', 'బాబర్' చిత్రాల్లో నటించాడు. వీటితోపాటు 'జెన్నీ ఔర్ జుజు' అనే టీవీ సిరీస్‌లో కనిపించాడు.