Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Gold Price Hike Again Today 2025 October 31st In India1
ఒకేరోజు రెండుసార్లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు

బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది.. శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం గరిష్టంగా రూ. 1200 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1800లకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి 600 రూపాయలు పెరిగిందన్న మాట. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎలా ఉంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1800 పెరిగి రూ. 1,23,280 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,000 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 పెరిగి రూ. 123430 వద్ద ఉంది. 10 గ్రామ్స్ 22 క్యారెట్ల రేటు రూ. 1600 పెరిగి రూ. 1,13,150 వద్ద ఉంది.చెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం స్థిరంగా ఉన్న రేటు సాయంత్రానికి కూడా స్థిరంగానే ఉంది. ఇక్కడ 10 గ్రామ్స్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,280 వద్ద ఉండగా.. 10 గ్రామ్స్ 24 క్యారెట్ల రేటు రూ. 1,13,000 వద్దనే ఉంది.వెండి ధరలువెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 1,65,000 వద్ద ఉంది. అంటే ఒక గ్రామ్ సిల్వర్ ధర 165 రూపాయలన్నమాట. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 151000 వద్ద నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి ధర కొంత తక్కువే అని తెలుస్తోంది.

Ravi Teja film Mass Jathara box office prediction2
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!

మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్‌కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ ‍డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్‌ సైట్‌‌ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్‌ సాయంత్రం రిలీజ్‌ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్‌తో పాటే మూవీ రిలీజ్‌ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్‌గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్‌లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.

IND vs AUS: Sanju Samson gets Gambhir’s backing but fails to make use of promotion3
సంజూకు ప్ర‌మోష‌న్ ఇచ్చిన గంభీర్‌.. క‌ట్ చేస్తే! 4 బంతుల‌కే

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గం‍భీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ ప్రారంభించ‌డం మొద‌లు పెట్టారు.అయితే అప్పుడు శుభ్‌మ‌న్ గిల్ టీ20 జ‌ట్టుకు దూరంగా ఉండ‌డంతో శాంస‌న్‌ను ఓపెన‌ర్‌గా అవ‌కాశ‌ముంది. కానీ గిల్ తిరిగి టీ20 సెటాప్‌లోకి రావ‌డంతో ఆసియాక‌ప్‌-2025 నుంచి సంజూ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మారిపోయింది. ఈ ఏడాది జ‌రిగిన ఆసియాక‌ప్‌లో భార‌త ఓపెన‌ర్లుగా గిల్‌, అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగ‌గా.. శాంస‌న్‌ను మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు పంపారు.కొన్ని మ్యాచ్‌ల‌లో నంబ‌ర్ 6, మ‌రి కొన్ని మ్యాచ్‌ల‌లో ఐదో స్ధానంలో ఈ కేర‌ళ బ్యాట‌ర్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. దీంతో టీమ్ మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సంజూ లాంటి అద్భుత‌మైన బ్యాట‌ర్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డంలేద‌ని చాలా మంది మాజీలు మండిపడ్డారు.సంజూకు ప్ర‌మోష‌న్‌..ఈ క్ర‌మంలో మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20లో సంజూ శాంస‌న్‌కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్ర‌మోష‌న్ ఇచ్చాడు. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ త్వ‌రగా ఔట్ కోవ‌డంతో శాంసన్‌ను నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్‌ నిర్ణయించుకుంది.కానీ సంజూ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ 4 బంతులు ఎదుర్కొని 2 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఆసీస్ పేస‌ర్ నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరిక‌పోయాడు. దీంతో సోషల్‌ మీడియాలో సంజూను ట్రోలు చేస్తున్నారు.టాపార్డర్‌లో అవకాశమిస్తే ఇలా ఆడుతావా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొంత మంది శాంసన్‌ను మద్దతుగా నిలుస్తున్నారు. వేర్వేరు స్ధానాల్లో అతడిని బ్యాటింగ్‌కు పంపితే ఎలా, అతడికంటూ ఒక పొజిషన్ ఫిక్స్‌ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చదవండి: కేకేఆర్‌లోకి రోహిత్‌ శర్మ ‘కన్‌ఫామ్‌’!.. స్పందించిన ముంబై ఇండియన్స్‌Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025

Karthika masam 2025 famous shiva temples in telugu states you can visit4
హర హర మహాదేవ : కార్తీకంలో దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు

కార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఒక్క రోజులోనే పంచారామాలను ఒక్కరోజులోనే సందర్శించడం మరో విశేషం. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో సందర్శించదగిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.నిజానికి చెప్పాలంటే శివాలయం లేని గ్రామం ఉండదు. అయినా ప్రసిద్ధ శివాలయాలను, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించాలని భక్తులు భావిస్తారు. అమరారామం: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ప్రధాన దైవం అమరలింగేశ్వర స్వామి. అమరేంద్ర ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ పేరు వచ్చింది. కృష్టా నది దక్షిణ ఒడ్డున ఉన్న బాల చాముండిక అమరలింగేశ్వర స్వామి భార్య. ఈ ఆలయం రెండు అంతస్తులను కలిగి ఉన్న భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.ద్రాక్షారామం: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామంలో కొలువైన శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని సూర్య భగవానుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు.దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రాతి స్థంభాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం.సోమారామం: భీమవరంలో ఉన్న సోమారామం పంచారామాలలో మూడవది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చింది. చంద్రుని దశల ఆధారంగా దాని రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమి సమయంలో , సోమారామంలోని శివలింగం తెల్లగాను, అమావాస్య కు నల్లగా మారుతుందట.సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని కుమార రామ ఆలయం పంచారామాలలో చివరిది. వుడిని కుమార భీమేశ్వర స్వామిగా ​ కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పూర్తిగా సున్నపురాయితో తయారు చేసిన ఇక్కడి శివలింగం దాదాపు 16 అడుగుల ఎత్తు ఉంటుంది అలాగే ఈ ఆలయం 100 స్తంభాల మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది ప్రత్యేకం. కోటప్పకొండ : అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ ఒకటి. 1587 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండలో అత్యంత పురాతనమైన శివాలయం. శివుడిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు.కోటప్పకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా కూడా ఇది ప్రసిద్ధి. శ్రీశైలం: నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించాని చెబుతారు. ఈ క్షేత్రంలో పాతాళగంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు.ఛాయ సోమేశ్వర స్వామి : నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించారట. ఈ గుడిలోని శివ లింగం ప్రతిరోజూ శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గ ఇక్కడి శివుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.​రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమైన దేవాలయం. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. అత్యున్నతమైన వాస్తు, శిల్ప సంపదతో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఆలయం. రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు.​యాగంటి : కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. 5వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలవడం మరో ప్రత్యేకత. అలాగే యాగంటి నంది ప్రతీ ఏడాదీ కొంచెం కొంచెం పెరుగుతుందని చెబుతారు.​ఆలంపూర్ నవ బ్రహ్మ. : జోగుళాంబ-గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఉపసర్గ మొత్తం కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలున్నాయి.​సంగమేశ్వరుడు : కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్లనాడు ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.వేములవాడ రాజన్న: రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం, ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిది. ఇక్కడి ధర్మ గుండం జలాల్లో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.ఇవి కొన్ని శివాలయాలు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో శివాలయాలు, పవిత్రమైనవిగా, భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారం విలసిల్లుతున్నాయి. భక్తుల ఆదరణకు నోచుకున్నాయి.

KSR Comment on CM Revanth Reddy Movie Tickets Promise5
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్‌ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్‌ ప్రాంతంలో సినీ జూనియర్‌ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్‌ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్‌ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్‌ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్‌ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్‌ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్‌ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజా సినిమా బెనిఫిట్‌ షోతోపాటు టిక్కెట్‌ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్‌కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్‌ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్‌ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Allu Sirish and Nayanika magical engagement Ceremony Photos
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ -నయనిక ఎంగేజ్‌మెంట్‌ (ఫొటోలు)

Eluru Woman Harassed by In Laws: Shocking Incident in Jangareddygudem7
భర్తే కాదు.. బావతోనూ సంసారం చేయాలని చిన్న కోడలిపై దారుణం

సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ అత్తా,మామలు చిన్న కోడలిని చిత్ర హింసలకు గురి చేయడం కలకలం రేపింది. అందుకు తన తల్లిదండ్రులకు బాధితురాలి భర్త రంజింత్‌ కుమార్‌ వంతపాడటం గమనార్హం. జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ చిన్న కోడలిపై అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కోరికను వ్యక్తం చేశారు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తల్లిదండ్రులు డిమాండ్‌కు భర్త మౌనంగా ఉండిపోవడంతో బాధితురాలికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చినప్పటికీ, తాము చెప్పినట్లు చేయలేదన్న కారణంతో గత పది రోజులుగా ఆమెను, ఆమె కుమారుణ్ని గదిలో బంధించారు. గదికి కరెంటు, మంచినీళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందడంతో, వారు పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. బాధితురాలిని బంధించిన గదికి తాళాలు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Epstein Ties Row: Prince Andrew Loses Royal Titles Vacate Mansion8
‘పో బయటకు..’ సోదరుడికి షాకిచ్చిన బ్రిటన్‌ రాజు

బ్రిటన్‌రాజు కింగ్‌ చార్లెస్‌ III తన సోదరుడు ప్రిన్స్‌ ఆండ్రూకి భారీ షాకిచ్చారు. రాయల్ టైటిల్స్‌ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్‌ ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఇటీవల బయటకువచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్‌ చార్లెస్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్‌సోర్‌ రెసిడెన్సీని ఖాళీ చేయాలని బ్రిటన్‌రాజు కింగ్‌ చార్లెస్‌ III తన సోదరుడు ప్రిన్స్‌ ఆండ్రూని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్‌హమ్‌ ప్యాలెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రూ ఈ ఆరోపణలను తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని బ్రిటన్ బకింగ్‌హమ్‌ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధితులకు రాజు చార్లెస్, రాణి కామిల్లా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది.విర్జీనియా జియూఫ్రే అనే మహిళ 17 ఏళ్ల వయసులో తనపై ప్రిన్స్‌ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 2022లో పౌర న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే.. ఆమెతో అనైతిక ఒప్పందం కుదుర్చుకుని ఆ కేసును ఆయన ముగించారు. ఆ సమయంలో ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈలోపు.. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ప్రిన్స్‌ఆండ్రూ పేరు రావడం సంచలనంగా మారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే తన అన్న.. బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ ఒత్తిడి మేరకు ప్రిన్స్‌ ఆండ్రూ తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్‌ ఆండ్రూ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్‌ 27వ తేదీన లిచ్‌ఫీల్డ్ క్యాథడ్రల్ వద్ద రాజు చార్లెస్‌ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ఆండ్రూ-ఎప్‌స్టీన్‌ సంబంధాల గురించి ఎంతకాలంగా తెలుసు?” అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవర్‌అప్ చేయమని చెప్పారా? అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్‌ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయ్యింది.అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం కేసు పత్రాలలో దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పాప్‌ సింగర్‌ మైఖేల్‌ జాక్సన్‌ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో.. ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్‌ ఆండ్రూపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్‌ నివాసంలో ఓ గ్రూప్‌ ఫొటో దిగామని, అప్పుడు ప్రిన్స్‌ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్‌, ట్రంప్‌ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం.

OpenAI Sam Altman Fails To Get Refund On Tesla Roadster Booked9
ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి

గ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) 2018 జూలైలో 50000 డాలర్లతో టెస్లా రోడ్‌స్టర్‌ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని ఇన్నాళ్లయినా.. ఇప్పటికీ కారు డెలివరీ జరగలేదు, డబ్బు కూడా రీఫండ్ కాలేదు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు.శామ్ ఆల్ట్‌మాన్.. టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్, రీఫండ్ కోసం అభ్యర్థించిన మెయిల్ స్క్రీన్‌షాట్‌లను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను చెల్లించిన డబ్బును రీఫండ్ చేయమని కూడా మెయిల్ చేశారు. కానీ అతనికి అడ్రస్ నాట్ ఫౌండ్ అనే రిప్లై వచ్చింది.''టెస్లా రోడ్‌స్టర్‌ కారును కొనుగోలు చేయడానికి.. నేను ఉత్సాహంగా ఉన్నాను. కంపెనీ కారును డెలివరీ చేయడంలో జరిగిన ఆలస్యాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ 7.5 సంవత్సరాలు వేచి ఉండటం చాలా కాలంగా అనిపించింది'' అని కూడా శామ్ ఆల్ట్‌మాన్ మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.రద్దు చేసుకోవడం కష్టంటెస్లా రోడ్‌స్టర్‌ కారును బుక్ చేసుకున్న తరువాత.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్న వారిలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ మాత్రమే కాకుండా, ప్రముఖ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ కూడా ఉన్నారు. ఈయన 2017లో రెండు టెస్లా రోడ్‌స్టర్‌లను రిజర్వ్ చేసుకున్నట్లు వెల్లడించారు. బుకింగ్ ప్రక్రియ సులభంగా జారిపోయింది. కానీ రిజర్వేషన్‌ను రద్దు చేసుకోవడం ఊహించిన దానికంటే చాలా కష్టమని బ్రౌన్లీ అన్నారు.టెస్లా రోడ్‌స్టర్‌టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. 2017లో రోడ్‌స్టర్‌ను పర్ఫామెన్స్ బేస్డ్ ఈవీగా ఆవిష్కరించారు. ఇది 1.9 సెకన్లలో 0 నుంచి 96 కి.మీ వేగాన్ని అందుకోగలదని.. గంటలు 402 కి.మీ గరిష్ట వేగంతో 997 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిలోకి రాలేదు. 2024లో కూడా రోడ్‌స్టర్ బయటకు రాలేదని మస్క్ పేర్కొన్నారు. కాగా దీనిని ఎప్పుడు అధికారికంగా లాంచ్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.A tale in three acts: pic.twitter.com/ClRZBgT24g— Sam Altman (@sama) October 30, 2025

PM pays homage to Sardar Patel on 150th birth anniversary10
భారత్‌పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం: ప్రధాని మోదీ

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగాయి. పటేల్‌ భారీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం. పరేడ్‌ను ప్రారంబించి జాతీయ ఏకతా ప్రతిజ్ఞను చేయించారాయన. అంతకు ముందు.. తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఒక పోస్ట్‌ ఉంచారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశం నివాళులు అర్పిస్తోంది. ఆయన భారత ఏకతకు ప్రేరణగా నిలిచారు. ఆయన చూపిన మార్గంలో దేశాన్ని బలంగా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే సంకల్పాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నాం అని సందేశం ఉంచారు. India pays homage to Sardar Vallabhbhai Patel on his 150th Jayanti. He was the driving force behind India’s integration, thus shaping our nation’s destiny in its formative years. His unwavering commitment to national integrity, good governance and public service continues to… pic.twitter.com/7quK4qiHdN— Narendra Modi (@narendramodi) October 31, 2025స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన పరేడ్‌లో వివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. ఫ్లాగ్ మార్చ్, CAPF, పోలీస్, NCC, బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, శునకాలతో కూడిన మౌంటెడ్ యూనిట్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. మహిళా బలగాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చివరగా ఎయిర్ షో నిర్వహించింది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం నేపథ్యంలో ఈ పరేడ్‌ను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.మోదీ మాట్లాడుతూ.. . దేశ సమగ్రత, ఐక్యత మనందరికీ చాలా ముఖ్యమైనది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కానీ మా ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేరుస్తోంది. కశ్మీర్ సమస్యను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. ఆర్టికల్ 370 ని తొలగించి కశ్మీర్ ను భారత్ అభివృద్ధిలో భాగం చేశాం. భారత్ సరిహద్దులలో జనాభాను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకుంది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంతర్గత భద్రతను గాలికి వదిలేసింది. భారత్ పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులందరికీ భారత్ సత్తా తెలిసి వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, వారికి మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టం . భారత్ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా మారారు. దేశానికి ముప్పు ఏర్పడితే ప్రతి ఒక్కరికి భద్రత ప్రమాదంలో పడుతుంది’’ అని అన్నారు. ਸਰਦਾਰ ਵੱਲਭ ਭਾਈ ਪਟੇਲ ਦੀ 150ਵੀਂ ਜਯੰਤੀਕੌਮੀ ਏਕਤਾ ਦਿਵਸ ਵਜੋਂ ਮਨਾਇਆ ਜਾ ਰਿਹਾ ਦਿਨStatue of Unity ‘ਤੇ PM Modi ਨੇ ਦਿੱਤੀ ਸ਼ਰਧਾਂਜਲੀ#SardarVallabhbhaiPatel #jayanti #pmmodi #statueofunity #DailypostTV pic.twitter.com/znGkQRbK4f— DailyPost TV (@DailyPostPhh) October 31, 2025 Met the family of Sardar Vallabhbhai Patel in Kevadia. It was a delight to interact with them and recall the monumental contribution of Sardar Patel to our nation. pic.twitter.com/uu1mXsl3fI— Narendra Modi (@narendramodi) October 30, 2025 ఇదిలా ఉంటే.. పటేల్‌ జయంతి వేళ ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. గురువారం ఏకతా నగర్‌లోని పటేల్‌ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాతో కాసేపు ముచ్చటించారు. పటేల్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉంది. ఆయన దేశానికి చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నాం అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement