ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెల్త్ వెల్‌నెస్ సెంటర్ల కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, పదికోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.
ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఆయుష్మాన్‌భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు.