సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం చంద్రబాబు నాయుడుల కుట్ర బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్సార్ కుటుంబం మీద కుట్రలు జరుగుతున్న క్రమంలో వైఎస్సార్‌సీపీ పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు, కుట్రలు ఎదురైనా.. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా నిలిచిందన్నారు.