తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గుర్తించిన చంద్రబాబు హడలిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, రాజధాని నిర్మాణంలో వైఫల్యం, సంక్షేమ పథకాలు అమల్లో చేతులేత్తేయడం, యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వం అంటేనే ప్రజలు మండిపడుతున్నారు.