‘రైతన్నల కష్టాలు నాకు తెలుసు. మీకు కొండంత అండగా నేనుంటాను అని హామీ ఇస్తున్నా. మన ప్రభుత్వం రాగానే పెట్టుబడి కోసం ప్రతి ఏటా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 ఇస్తాం. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం, బీమా సొమ్ము కూడా మేమే చెల్లిస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం, వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు కరెంటు సరఫరా చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తాం. టోల్ ట్యాక్స్ లేకుండా చేస్తాం. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.