డిసెంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని వివరించారు. అదేవిధంగా నవంబర్ 1 నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకునే నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని ప్రకటించారు. గురువారం అనంతపురం జూనియర్ కాలేజీలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్థానిక ప్రజాపతినిధులు, ఉన్నతాధికారులు తదితరుల పాల్గొన్నారు.
పథకం గురించి అందరికీ చెప్పండి
Published Thu, Oct 10 2019 1:52 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement