ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2020లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే 45 స్థానాల్లో విజయం సాధించిన ఆప్.. మరో 17 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వరుసగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ మొదలైంది.