పవన్ కళ్యాణ్ అధికారపార్టీని వదిలి.. ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణమని.. ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పౌరుషమా అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్‌ను నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు,లోకేష్‌ల అవినీతిపై మాట్లాడిన పవన్.. ప్రస్తుతం ప్రతిపక్షంపై విమర్శలు చేయటం దారుణమన్నారు. ప్యాకేజీలు పవన్ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని, చంద్రబాబుతో లాలూచీ పడటమే పౌరుషమా అని ప్రశ్నించారు.