చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో శుక్రవారం పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కురబలకోట బీసీ కాలనీకి చెందిన ఇస్మాయిల్, అయేషా దంపతుల కుమారులు షేక్ సయ్యద్ (10), మౌలాలి (8) స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు, మూడు తరగతులు చదువుతున్నారు.