ఓట్ల రూపంలో ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు దాన్ని వేరే అంశాలపై నెట్టేయడానికి ఢిల్లీ వేదికగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఆయన వ్యవహారశైలి ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించినట్లైందని ఢిల్లీలోని జాతీయ స్థాయి నాయకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అపజయాన్ని ఈవీఎంలు, ఈసీపై తోసేయడానికి చేస్తున్నట్లుగానే అనిపిస్తుందని అంటున్నారు.