చైనా ఇంజనీర్లకు, పాక్ పోలీసులకు మధ్య ఘర్షణ | Chinese Workers Thrash Pak Cops At CPEC | Sakshi
Sakshi News home page

చైనా ఇంజనీర్లకు, పాక్ పోలీసులకు మధ్య ఘర్షణ

Published Sat, Apr 7 2018 2:46 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా చైనా నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపీఈసీ) వద్ద చైనా ఇంజనీర్లకు, పాకిస్తాన్‌ పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఖనేవాల్‌ వద్ద జరిగిన ఈ గొడవలో చైనీయులు పాక్‌ పోలీసులను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, వారు పారిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. సీపీఈసీ పరిధిలోని ‘ఎమ్‌4 మోటార్‌వే’ నిర్మాణం వద్ద చైనా ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్యాంప్‌ వదిలి వెళ్లిపోవాల్సిందిగా వారిని పాక్‌ పోలీసులు బెదిరింపులకు గురిచేశారనే కారణంగా పోలీసులకు చైనీయులకు మధ్య చిన్నపాటి వాదన తలెత్తింది. ఇది చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement