China Pakistan Economic Corridor
-
చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..!
లాసా: భారత్‌పై చైనా తన కుతంత్రాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వాణిజ్యపరంగా, భౌగోళికంగా భారత్‌ను దెబ్బకొట్టేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మురం చేసింది. దాయదాది దేశం పాకిస్థాన్‌తో స్నేహం చేస్తూ చైనా ఇష్టరీతినా వ్యవహరిస్తోంది. 2013 నుంచి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కింద పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చైనా ప్రారంభించింది. ఈ కారిడర్‌పై భారత్ అంతర్జాతీయంగా చైనా కుతంత్రాలను వెలుగులోకి తెచ్చింది. చదవండి: బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్‌ను చట్టవిరుద్దమైందని భారత్ పేర్కొంది. ఈ కారిడార్ జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలగుండా వెళ్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది లోక్‌సభలో వెల్లడించింది. భారత్‌పై చైనా కుతంత్రాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. తాజాగా టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్స్‌లలో దాదాపు 30 విమానాశ్రయాలను చైనా నిర్మించినట్లు వార్తలు వస్తోన్నాయి. చైనా ఆర్మీకి ఆయుధాలను, సైనికుల రవాణా సులభంగా ఉండేందుకుగాను 30 సివిల్ ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఉరుమ్కి, కష్గర్, లాసా, షిగాట్సే ఇతర ప్రదేశాలలో ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దులోని మారుమూల ప్రాంతాలలో చైనా, పౌర సైనిక మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుందని చైనా అధికారిక మీడియా నివేదించింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో పౌర విమానయానం వేగంగా అభివృద్ధి చెందడంతో వాయు రవాణా సౌలభ్యం మరింత సులభమవుతోందని చైనా ఆర్మీ అధికారి చెప్పారు. ఈ విమానశ్రాయాలతో డబ్ల్యుటిసి జిన్జియాంగ్, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతాలతో పాటు భారత సరిహద్దును పర్యవేక్షించనుంది.టిబెట్‌లో చైనాలో మౌలిక సదుపాయాలను పెంచుతోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరగా ఉన్న టిబెటన్ సరిహద్దు పట్టణమైన నింగింగ్తో ప్రావిన్షియల్ రాజధాని లాసాను కలిపే హైస్పీడ్ బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించాడు. టిబెటిన్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన తొలి చైనా నాయకుడు. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇటీవల నింగిచిని సందర్శించారు, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన మొదటి చైనా నాయకుడు. చదవండి: Old Phones: చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ! -
భారత్ జోక్యం సహించబోం: చైనా
సాక్షి, న్యూఢిల్లీ : చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా ఓ బస్ సర్వీస్ త్వరలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ బస్ సర్వీస్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న భారత్ ఈ బస్ సర్వీస్ తమ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని భారత్ ఇప్పటికే నిరసన తెలిపింది. పీఓకేను ఎప్పటికీ తమ భూభాగాంగానే పరిగణిస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నామని చైనా, పాకిస్తాన్‌లు వెల్లడించాయి. (చైనా పాక్ ఒప్పందం.. భారత్ మండిపాటు) పాకిస్తాన్‌కు చెందిన ఓ వార్తా పత్రిక కథనం ప్రకారం.. చైనా-పాక్‌ల మధ్య బస్ సర్వీస్‌పై భారత్ అనవసర రాద్ధాంతం చేస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ తప్పుడు సంకేతాలు పంపుతోందని మండిపడింది. భారత్ లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది. అభ్యంతరాలు తెలపడం ద్వారా కశ్మీర్ మాదే అనే ధోరణితో భారత్ వ్యవహరిస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. గగ్గోలు పెట్టినంత మాత్రన వివాదం సమసిపోదనీ, ఐక్యరాజ్య సమితి ఆద్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం సరైన పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది. ఇదిలాఉండగా.. భారత్ అభ్యంతరాలపై చైనా కూడా స్పందించింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టులో మరే దేశం జోక్యం సహించబోమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు-కాంగ్ స్పష్టం చేశారు. ఇండియా అభ్యంతరం తెలిపినంత మాత్రాన కశ్మీర్ అంశంపై చైనా విధానం మారబోదని తెలిపింది. ఈ మేరకు పాక్ పత్రిక ప్రచురించింది. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్ సర్వీస్ నవంబర్ 13న ప్రారంభం కానుందని సమాచారం. -
చైనా ఇంజనీర్లకు, పాక్ పోలీసులకు మధ్య ఘర్షణ
-
చైనా ఇంజనీర్లు వర్సెస్ పాక్ పోలీసులు
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) వద్ద చైనా ఇంజనీర్లకు, పాకిస్తాన్ పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ వద్ద జరిగిన ఈ గొడవలో చైనీయులు పాక్ పోలీసులను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, వారు పారిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీపీఈసీ పరిధిలోని ‘ఎమ్4 మోటార్వే’ నిర్మాణం వద్ద చైనా ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్యాంప్ వదిలి వెళ్లిపోవాల్సిందిగా వారిని పాక్ పోలీసులు బెదిరింపులకు గురిచేశారనే కారణంగా పోలీసులకు చైనీయులకు మధ్య చిన్నపాటి వాదన తలెత్తింది. ఇది చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ గొడవకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో ప్రైవేట్ వీడియోలో చైనా ఇంజనీర్ ఒకరు పోలీసు వ్యాను పైకెక్కి డోర్ తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడి నుంచి తప్పించుకునేందుకు పోలీసు లోపలి వైపు నుంచి డోర్ లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా.. గొడవ ముగిసిన తర్వాత పాక్ పోలీసుల క్యాంప్‌కు కరెంటు సరఫరా నిలిపివేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టామని.. ఈ గొడవకు పూర్తి బాధ్యత చైనా ఇంజనీర్‌దే అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు. గొడవకు కారణమైన ఐదుగురు చైనీయులను వెళ్లిపోవాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
భారత్ దాడి.. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణాలపై భారత్ దాడి చేస్తుందేమోనని పాకిస్తాన్ భయపడుతోంది. ఈ మేరకు గిల్గిత్ బాల్టిస్తాన్లోని ప్రభుత్వానికి పాకిస్తాన్ కేంద్ర హోం శాఖ మంత్రి లేఖ రాసినట్లు ఆ దేశ జాతీయ పత్రిక ఒకటి పేర్కొంది. గిల్గిత్లోని సీపీఈసీ నిర్మాణాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పింది. భారత్ 400 మంది ముస్లిం యువతకు ఆప్ఘనిస్తాన్‌లో సీపీఈసీ మార్గంలో దాడి చేసేందుకు ట్రైనింగ్ ఇస్తోందని కూడా లేఖలో ఉన్నట్లు తెలిపింది. కారాకోరం పర్వత శ్రేణి వద్ద గల బ్రిడ్జి కూడా భారత్ ఎంచుకున్న లక్ష్యాల్లో ఉందని చెప్పింది. సీపీఈసీ ప్రాజెక్టు కశ్మీర్లో అంతర్భాగమైన గిల్గిత్ బాల్టిస్థాన్ నుంచి వెళ్తుండటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన చైనా గత వారం సీపీఈసీపై చర్చలకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
చైనాకు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన పాక్..!
బీజింగ్: మిత్రదేశం చైనాకు పాకిస్థాన్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఆ దేశం ఆఫర్‌ను పాక్ తిరస్కరించింది. సీపీఈసీలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో డైమర్-భాష డ్యామ్ నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ముందుకురాగా.. పాక్ అందుకు నిరాకరించింది. 60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యామ్‌ను తామే కట్టుకుంటామని పాక్ నేరుగా చైనాకే చెప్పినట్టు తెలుస్తోంది. భారత్ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యామ్ నిర్మిస్తుండటంతో.. ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం నిరాకరించాయి. ఈ నేపథ్యంలో సీపీఈసీలో కీలకమైన ఈ డ్యామ్‌కు రుణమిచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 14 బిలియన్ డాలర్లకు పెంచడం.. ఈ మేరకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు తీవ్రమైన షరతులు పెట్టడంతో పాక్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో చైనా షరతులు అంగీకరించడం ఎంతమాత్రం వీలు కాదని, అందుకే సొంతంగా ప్రాజెక్టు చేపడతామని పాకిస్థాన్ సర్కారు స్పష్టం చేసినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ దినపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. డైమర్-భాషా డ్యామ్ విషయంలో చైనా పెడుతున్న షరతులు ఆమోదయోగ్యం కాదు.. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పాక్ వాటర్, విద్యుత్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ముజామిల్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై పాకిస్థాన్ తాజా వైఖరి చైనాను బిత్తరపోయేలా చేసింది. తమను సంప్రదించకుండా ప్రాజెక్టును పాక్ ఇలా ఊహించని ఝలక్ ఇస్తుందని తాము అనుకోవడం లేదని చైనా వర్గాలు అంటున్నాయి. మొత్తం సీపీఈసీ ప్రాజెక్టును ప్రమాదంలో పడేసేలా చైనా ఆఫర్‌ను పాక్ తిరస్కరించలేదని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రాజెక్టు యాజమాన్యం, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు, భద్రత తామే చూసుకుంటామని చైనా కంపెనీలు పెడుతున్న షరతులు దేశ ప్రయోజనానికి భంగకరమని పాక్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బెంబేలెత్తిన చైనా.. ఆ భేటీ వెనుక మర్మమిదే!
-
బెంబేలెత్తిన చైనా.. ఆ భేటీ వెనుక మర్మమిదే!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను భయపెట్టేందుకు రెండురోజుల కిందట ఇమ్రాన్‌ఖాన్ తన పార్టీ ఫేస్బుక్ పేజీలో పెట్టిన ఓ వీడియో.. షరీఫ్ కన్నా ఎక్కువగా మరొకరిని భయపెట్టినట్టు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ జిమ్‌లో భారీగా కసరత్తులు చేస్తూ.. ఇక నవాజ్ షరీఫ్ భయపడక తప్పదంటూ వీడియో తీసి.. దానిని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఫేస్బుక్ పేజీలో పెట్టారు. షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవంబర్ 2న ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ‘ఆక్యుపై ఇస్లామాబాద్’ (ఇస్లామాబాద్ ముట్టడి) పేరిట భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కోసం భారీ సన్నాహాలు చేస్తున్నామనే హెచ్చరికలు జారీచేసేందుకు ఆయన ఈ కసరత్తుల వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. కానీ ఈ వీడియో షరీఫ్ కన్నా ఎక్కువగా చైనాను బెంబేలెత్తించినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోతో భయాందోళన చెందిన చైనా రాయబారి మంగళవారం అనూహ్యంగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయ్యారు. ప్రధాని షరీఫ్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ర్యాలీలో పాక్‌లోని చైనా పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయవద్దని, ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 51 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పై వ్యతిరేక విమర్శలు చేయవద్దని చైనా రాయబారి ఇమ్రాన్‌ను కోరినట్టు పాక్ మీడియా బుధవారం తెలిపింది. తన కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైనా ప్రధాని నవాజ్ షరీఫ్ బాధ్యత వహించకపోవడం, కశ్మీర్ విషయంలో ఆయన నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతూ ప్రతిపక్ష పీటీఐ, ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 2న ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ రోజున రాజధానిని పూర్తిగా స్తంభింపజేసి తమ సత్తా చాటుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లోని చైనా రాయబారి సున్ వీడాంగ్ స్వయంగా ఇమ్రాన్ ఖాన్‌తో భేటీకి విజ్ఞప్తి చేశారని పీటీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కి ఇమ్రాన్ ఖాన్ మద్దతు కూడగట్టడానికి, ఈ ప్రాజెక్ట్‌కు ఆయన వ్యతిరేకమన్న వదంతులను దూరం చేసేందుకు ఈ భేటీ జరిగినట్టు పాక్ మీడియా తెలిపింది. పాకిస్థాన్‌కు చైనా అందిస్తున్న మద్దతును ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసించారని, సీపీఈసీ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆయన చైనా రాయబారికి భరోసా ఇచ్చారని, ఈ ప్రాజెక్టు పాకిస్థాన్ తలరాతను మార్చివేస్తుందని ఆయన పేర్కొన్నట్టు పీటీఐ వర్గాలు తెలిపాయి. -
భారత్‌కు చైనా వార్నింగ్!
బీజింగ్: కల్లోలిత బలూచిస్థాన్‌లో తలపెట్టిన పాకిస్థాన్-చైనా ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)ని అడ్డుకునేందుకు భారత్ కుట్రపన్నితే.. అప్పుడు చైనా రంగంలోకి దిగి తీరుతుందని ఆ దేశానికి చెందిన ఓ మేధోసంస్థ హెచ్చరించింది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయని హు షిషెంగ్ అన్నారు. చైనాకు చెందిన సమకాలీన అంతర్జాతీయ వ్యవహారాల కేంద్రం (సీఐసీఐఆర్)లోని దక్షిణ, దక్షిణాసియా, సముద్ర దేశాల అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న ఆయన ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనాకు చెందిన అత్యంత శక్తిమంతమైన మేధో కేంద్రంగా పేరొందిన సీఐసీఐఆర్లో పరిశోధకుడిగా పనిచేస్తున్న హు షిషెంగ్ మాట్లాడుతూ.. ’ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రధాని మోదీ కశ్మీర్ (పాక్ ఆక్రమిత కశ్మీర్), బలూచిస్థాన్ అంశాలపై ప్రస్తావించడం తాజాగా చైనాను ఆందోళనకు గురిచేస్తున్నది. పాకిస్థాన్ విషయంలో భారత విధానంలో ఇది కీలక మలుపు అయి ఉండొచ్చు. కానీ తొలిసారి ఈ అంశాన్ని భారత్ ప్రస్తావించడం చైనా మేధావుల్లో ఆందోళన కలిగిస్తున్నది’ అని హు తెలిపారు. కల్లోలిత బలూచిస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను భారత్ వినియోగించుకుంటే అది సీపీఈసీని నష్టం కలిగించవచ్చునని, అప్పుడు చైనా రంగంలోకి దిగక తప్పదని ఆయన చెప్పారు. చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్ నుంచి బలూచిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవుకు అనుసంధానం చేసేందుకు చైనా ప్రతిష్టాత్మకంగా వన్ రోడ్డు వన్ బెల్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 46 బిలియన్ డాలర్ల (రూ. 3 లక్షల కోట్ల) వ్యయంతో ప్రతిపాదించిన సీఈసీకి ఆటంకాలు కలిగితే చైనా చూస్తూ ఊరుకోదని హు వ్యాఖ్యలు చేశారు.