ఈ నెల 14న పీఆర్సీ..! | CM KCR about Govt Employees PRC | Sakshi
Sakshi News home page

ఈ నెల 14న పీఆర్సీ..!

Published Wed, May 9 2018 9:22 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు తీపి కబురు వినిపించబోతోంది. ఈ నెల 14న వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయనున్నారు. ఉపాధ్యాయులు, టీచర్ల డిమాండ్లపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 14న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌), బదిలీలు, పదవీ విరమణ వయసు పెంపు సహా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన మొత్తం 18 డిమాండ్లను చర్చించనున్నారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement