మరోసారి వార్తల్లో కలెక్టర్‌ ఆమ్రపాలి | collector amrapali participates in trecking camp | Sakshi
Sakshi News home page

మరోసారి వార్తల్లో కలెక్టర్‌ ఆమ్రపాలి

Published Fri, Oct 13 2017 12:54 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో మారు వార్తల్లో నిలిచారు. ఏదో ఒక కార్యక్రమంతో ద్వారా ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆమ్రపాలి తాజాగా అడవుల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ దర్శనమించ్చారు. ధర్మసాగర్‌ ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రెక్కింగ్‌ నిర్వహించారు. విద్యార్థులు, ఔత్సాహికులతో కలిసి దేవునూర్‌ గుట్టలపై ట్రెక్కింగ్‌ చేశారు. పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఆమ్రపాలి గతంలో కూడా ట్రక్కింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. మహబూబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్ద గుట్టల్లో కలెక్టర్ ప్రీతీ మీనా, ఆమ్రపాలి కలిసి పర్యటించిన వీడియోలు అప్పట్లో నెట్‌లో హల్‌చల్ చేశాయి. మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్ట కొండలపై నిర్వహించిన రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టివల్‌‌లో ఆమ్రపాలి పాల్గొని సందడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement