రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ పెద్దల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆడియో టేపులను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే 3 కోట్లు ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ డిమాండ్ చేశారని ఆరోపించారు. అలాగే టీఆర్‌ఎస్ నాయకుడు దానం నాగేందర్‌తో కుమ్మకై 10 కోట్లు తీసుకొని ఆయనపై బలహీత నేత దాసోజు శ్రవణ్‌ను నిలబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.