Kyama Mallesh
-
ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆ పార్టీ సీనియర్ నేత క్యామ మల్లేష్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరబోతున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో క్యామ మల్లేష్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించినప్పటికీ.. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన క్యామ మల్లేష్ ఏఐసీసీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు టికెట్లు అమ్ముకుంటున్నారని, భక్తచరణ్ దాస్ కొడుకు టికెట్ కోసం తనను మూడు కోట్లు డిమాండ్ చేశారని వెల్లడించి ఆయన సంచనలం రేపారు. దీంతో టీపీసీసీ ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేసేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్యామ మల్లేష్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా పేరొన్న ఆయన.. తాను బీసీని కావడం వల్లే కాంగ్రెస్‌లో అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ అధిష్టానం మాటలు వినకుండా నేను రెబెల్‌గా నామినేషన్ వేయడం బాధాకరమే. కానీ రెబల్‌గా పోటీచేసిన మల్రెడ్డి సోదరులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ కోసం నిజాయితీగా 35 ఏళ్ళుగా సేవలు అందించాను. కేవలం ఒక బీసీని కాబట్టే నన్నూ ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలు కొనసాగలన్నా.. టిక్కెట్ కావాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇబ్రహీంపట్నం మహాకూటమి అభ్యర్థి రంగారెడ్డికి మల్లరెడ్డి సోదరులే మద్దతు తెలుపడం లేదు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలు, నా కార్యకర్తలు, అనుచరులతో చర్చలు జరిపిన తర్వాతే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నా. కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఈ రోజు ఇబ్రహీంపట్నంలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నా’ అని ఆయన స్పష్టం చేశారు. చదవండి: టికెట్ ఇచ్చేందుకు రూ. 3 కోట్లు అడిగారు 35 ఏళ్లు పార్టీకి సేవ.. ఇదా బహుమానం? -
35 ఏళ్లు పార్టీకి సేవ.. ఇదా బహుమానం?
పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. క్రమశిక్షణ ఉల్లంఘించలేదు.ఐదేళ్లు అధ్యక్ష పదవికి, 35 ఏళ్లు పార్టీకి సేవచేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌పై వేటు పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పార్టీపై ధిక్కారస్వరం వినిపించిన క్యామ.. టికెట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. టికెట్ ఇప్పిస్తామని ఆశావహుల దగ్గర రూ.3 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేగాకుండా టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమే ధ్యేయంగా యాదవ, కురమ సామాజికవర్గాన్ని ఏకం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. మల్లేష్‌పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లుప్రకటించింది. అంతేగాకుండా విలేకర్ల సమావేశంలో మల్లేష్ చేసిన ఆరోపణలపై మంగళవారం రాత్రిలోగా సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఆయనకు మరో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన క్యామ మల్లేష్‌కు చుక్కెదురైంది. టీడీపీకి ఈ స్థానాన్ని కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ కుమారుడు సాగర్.. టికెట్ వ్యవహారంలో తన కుటుంబీకులతో జరిపిన బేరసారాలతో కూడిన సంభాషణ ఆడియో టేపులను విడుదల చేశారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిని సీరియస్‌గా పరిగణించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మల్లేశ్‌కు ఉద్వాసన పలికారు. శుక్రవారం జిల్లాలోని మేడ్చల్‌లో సోనియా, రాహుల్ పర్యటన నేపథ్యంలో మల్లేశ్‌పై వేటు వేయడం కాంగ్రెస్‌వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా, ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు మల్లేష్ సంజాయిషీ ఇచ్చినా వివరణ సంతృప్తికరంగా లేదని ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం చేకూర్చలేదు: క్యామ పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. క్రమశిక్షణా ఉల్లంఘించలేదు. ఐదేళ్లు అధ్యక్ష పదవికీ, 35 ఏళ్లు పార్టీకి సేవకు చేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా అని క్యామ మల్లేశ్ ప్రశ్నించారు. 23 మంది బీసీలకు టికెట్లు ఇస్తే అందులో అందరికంటే తానేం తక్కువని అన్నారు. గొల్ల, కురుమ ఓట్లు అవసరం లేదని పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కుంతియా, ఉత్తమ్‌ను అడ్డగోలుగా దూషించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షోకాజ్‌తో సరిపెట్టారని, టికెట్ దక్కలేదని జెండా దిమ్మె, సోనియా, రాహుల్ ఫ్లెక్సీలను చించేసిన కార్తీక్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, బీసీని కాబట్టే తనను బలిపశువు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
‘వివరణ రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్న నేతలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరోపణలతో ఆయనకు ఇటీవల షోకాజు నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం రాత్రిలోగా వివరణ ఇవ్వాలని ఉత్తమ్ ఆదేశించారు. లేకపోతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోకుండా... ఉత్తమ్ ప్రకటనపై క్యామ మల్లేష్ స్పందించారు. పార్టీ అధిష్టానంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నల్గొండ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా.. ఎలాంటి తప్పు చేయని తనపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. టికెట్ ఇవ్వనందుకు పార్టీ దిమ్మెలు పగలగొట్టిన కార్తిక్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. 35 ఏళ్లుగా ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేశానని, పార్టీ కోసం తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేశానని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తన సొంత డబ్బులతో పార్టీని బలోపేతం చేశానని పేర్కొన్నారు. ప్రెస్మీట్లు పెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని వివర్శించిన నేతలపై కాకుండా తనపై కుట్రపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీసీని అని ఇలా అన్యాయం చేశారని.. విధేయతతో పనిచేసిన తనకు ఇలా చేయడం బాధాకరమన్నారు. -
పట్నంలో పోటీకి ఓకే
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసేందుకు సామ రంగారెడ్డి అంగీకరించారు. మొదటి నుంచి ఎల్బీనగర్లో పోటీ చేయాలని ఆయన ఆసక్తి కనబరిచినా కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది. దీంతో ఇబ్రహీంపట్నం సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే, పట్నంలో పోటీచేసేందుకు రంగారెడ్డి ససేమిరా అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు అమరావతికి వెళ్లారు. బాబు బుజ్జగింపులతో మొత్తబడ్డ ఆయన ఎట్టకేలకు పోటీకి అంగీకారం తెలిపారు. కాగా, ఈ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రొక్కం భీంరెడ్డికి నచ్చజెప్పి రెబల్‌గా నిలబడకుండా టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. క్యామ మల్లేష్‌తో సామ భేటీ కాంగ్రెస్ పార్టీలో మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యర్థిగా నిలిచిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అయితే, తనకు అన్యాయం చేసిన పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యతిరేకం తప్ప మహాకూటమికి కాదని మల్లేష్ తెలిపారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సామ రంగారెడ్డికి చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా మల్రెడ్డి! పట్టు వదలకుండా ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ టికెట్ కోసం పైరవీలు చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి తనకు టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మల్రెడ్డి బరిలో ఉంటే క్యామ మల్లేష్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
పొత్తు... ముగ్గురు చిత్తు..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహాకూటమి పొత్తు కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. మూడు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించడంతో నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సెగ్మెంట్ల టికెట్లను ఆశించిన ముగ్గురు ఆశావహులు పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఏకంగా రాజీనామాస్త్రాన్ని సంధించగా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ టికెట్లు అమ్ముకున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆడియో టేపులను విడుదల చేసి కలకలం సృష్టించారు. టికెట్ల కేటాయింపులో యాదవులకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈనెల 17న ఇండిపెండెంట్లుగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ భిక్షపతియాదవ్, ఇబ్రహీంపట్నం రేసులో నిలిచిన క్యామ మల్లేశ్ ప్రకటించారు. దీంతో జిల్లాలో కూటమి కుంపటి రాజేసినట్లయింది. మరోవైపు మాజీ మంత్రి శంకర్రావు కూడా షాద్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీకి కార్తీక్ షాక్! మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ సీటును టీడీపీకి సర్దుబాటు చేయడంతో అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శంషాబాద్‌లో గురువారం కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన కార్తీక్.. సీటు కేటాయింపుపై పునరాలోచన చేస్తే సరేసరి.. లేకపోతే తమ రాజీనామాలు ఆమోదించినట్లుగానే భావిస్తామని హెచ్చరించారు. ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని టీడీపీకి కాంగ్రెస్ కార్యకర్తలెవ్వరూ ఓటేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సీట్ల పంపకాలలో పీసీసీ పెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు. కార్తీక్ రాజీనామా ప్రకటనతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు శంషాబాద్‌లో పార్టీ కార్యాలయంలో హంగామా సృష్టించారు. ఫ్లెక్సీ, జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. ఈ అసమ్మతి సెగలు రాజేంద్రనగర్ రాజకీయాన్ని హాట్‌హాట్‌గా మార్చాయి. ఇదిలావుండగా, కార్తీక్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినందున.. బరిలో ఉంటారా? లేదా వేచిచూడాల్సిందే! మూటల మాటలు బయటపెట్టిన క్యామ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యంగా గొల్ల, కురుమలకు కేవలం ఒక సీటును కేటాయించడాన్ని తప్పుబట్టారు. అంతేగాకుండా టికెట్లను బహిరంగంగా అమ్ముకున్నారని సంచలన ప్రకటన చేశారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కుమారుడు టికెట్లను వేలం పెట్టారని, ఆశావహుల నుంచి రూ.3 కోట్ల మేర వసూలు చేశారని ఆరోపిస్తూ, భక్తచరణ్‌దాస్ కుమారుడు సాగర్ జరిపిన సంభాషణలుగా చెప్పుకుంటున్న ఆడియో టేపులను విడుదల చేశారు. ఈ ముడుపుల వ్యవహారం పార్టీలో కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం సీటును టీడీపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. బీసీలను మోసం చేసిన పార్టీకి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు, కురుమలను ఏకం చేస్తానని హెచ్చరించారు. రేపు నామినేషన్ వేస్తా : భిక్షపతియాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును ‘దేశం’కు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న ఆయన.. అధిష్టానం వ్యవహారశైలిపై విరుచుకుపడుతున్నారు. డబ్బుల సంచులకు టికెట్లు పంపిణీ చేశారని పీసీసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి బరిలో దిగుతున్న అభ్యర్థి మూటలకు ఆశపడి.. తనకు టికెట్ నిరాకరించారని దుయ్యబట్టారు. ఈనెల 17న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ టికెట్ కోసం ప్రయత్నించిన తోటకూర జంగయ్యయాదవ్ కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలావుండగా, మాజీ మంత్రి శంకర్రావు గురువారం షాద్‌నగర్‌లో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి పార్టీకి సవాల్ విసిరారు. -
కాంగ్రెస్‌లో ఆడియో టేపుల కలకలం
-
కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకున్నారు.. : క్యామ మల్లేష్
-
టికెట్ ఇచ్చేందుకు రూ. 3 కోట్లు అడిగారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్దాస్పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం టికెట్ కోసం భక్త చరణ్‌దాస్ కుమారుడు సాగర్ తన కుమారుడు అంజన్ కుమార్‌ను రూ. 3 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిం చారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియా సాక్షి గా విడుదల చేశారు. ‘ఈ నెల 2న భక్త చరణ్‌దాస్ దగ్గరకు నా కుమారుడిని ఇబ్రహీంపట్నం టికెట్ కోసం పంపించా. ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే రూ. 3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ డిమాండ్ చేశారు. ఈ ఆడియోను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్కలకు వినిపించా. వారంతా దీనిపై మేము మాట్లాడతాం, అప్పటివరకు బయట చెప్పకు అన్నారు. అంతేతప్ప ఎలాంటి చర్య లు తీసుకోలేదు. కాంగ్రెస్‌లో చాలా మంది బ్రోకర్లు, లోఫర్లు చేరారు. డబ్బులు తీసుకొని నాలాంటి నిజ మైన నాయకులకు అన్యాయం చేస్తున్నారు. రాహుల్ దూతలంతా దొంగల్లా, ఉత్తమ్, జానాలకు తొత్తుల్లా మారారు. ఈ విషయాలు రాహుల్ దృష్టికి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. బ్రోకర్లంతా కుమ్మక్కై అన్నదమ్ములు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులకు టికెట్లు ఇప్పించుకుంటున్నారు’ అని మల్లేశ్ ఆరోపించారు. భక్త చరణ్‌దాస్ వంటి వారివల్ల కాంగ్రెస్ భ్రష్టుపడుతోందని, ఇలాంటి బ్రోకర్ల వ్యవహారం రాహుల్ దృష్టికి తీసుకెళ్లేందుకే మీడియా ముందు ఆడియో టేపులు విడుదల చేస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్య లను సుమోటోగా తీసుకొని ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. టికెట్లు ఆశించి భంగపడ్డ బీసీ నేతలంతా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మేడ్చల్ నుంచి టికెట్ ఆశించిన జంగయ్య యాదవ్, యాదవ సంఘం నేతలు మల్లేశ్ యాదవ్, బాబూరాం యాదవ్‌లతో కలసి మల్లేశ్ మీడియాతో మాట్లాడారు. మా తడాఖా చూపిస్తాం: భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా పనిచేస్తూ వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగానని, అయినా తనకు టికెట్ నిరాకరించడం కేవలం కొందరి కుట్ర లో భాగమేనని భిక్షపతియాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఇటీవల రాహుల్ నిర్వహించిన సభను విజయవంతం చేసినందుకు రాహుల్ ప్రశంసించార ని, అలాంటి తనకే టికెట్ ఇవ్వకుండా ఉత్తమ్ అన్యాయం చేశారన్నారు. బీసీ వర్గాలకు సంబంధించిన నియోజకవర్గాలకు కూటమి పేరు చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, ఈ నెల 17న నామినేషన్ వేస్తానన్నారు. యాదవుల తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ భరతం పడతాం:జంగయ్య యాదవ్ గత ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో తనకన్నా తక్కువ ఓట్లు వచ్చిన కె.లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకిచ్చారో చెప్పాలని జంగయ్య యాదవ్ ప్రశ్నించారు. ఆయన టీఆర్ఎస్తోనూ టచ్‌లో ఉన్నారని, అలాంటి నేతకు టికెట్ ఎలా ఇచ్చారన్నారు. పార్టీని ముంచే నేతలు కావాలా లేక గెలిచే నేతలు కావాలా? అని అడిగారు. యాదవులను కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ భరతం పడతామన్నారు. కూటమి మోసం చేసింది: చెరుకు సుధాకర్ మహాకూటమిలోని పార్టీలన్నీ బీసీలను దారుణంగా మోసం చేశాయని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. టికెట్ల విషయంలో బీసీలకు సుముచిత స్థానం కల్పించలేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే ప్రజలే ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉత్తమ్, జానాల పీకలు ప్రజలే కోస్తారు... కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్లుగా ఉండి డబ్బు, ఆరోగ్యం పోగొట్టుకున్నానని, పార్టీ కోసం ఉన్నదంతా ఖర్చు చేశానని క్యామ మల్లేశ్ పేర్కొన్నారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఉత్తమ్, జానారెడ్డిలు నమ్మించి గొంతు కోశారని, వారి గొంతును ఎన్నికల్లో ప్రజలే కోస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రంలో దొంగల ముఠా తయారైందని, డబ్బున్న వారినే పిలిపించి మాట్లాడుతున్నారని మల్లేశ్ ఆరోపించారు. ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ నుంచి రూ. 10 కోట్లు తీసుకొని బలహీనుడు, స్థానికేతరుడు అయిన దాసోజు శ్రవణ్‌కు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు భార్యలు, కొడుకులకు టికెట్లు పంచుకుంటున్నారని ఉత్తమ్, జానాలపై ధ్వజమెత్తారు. వారిద్దరికీ రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని మల్లేశ్ తెలిపారు. ఈ నెల 17న బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. -
కలెక్టర్‌కు క్యామ వినతిపత్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘మా పార్టీకి కూడా ఎకరం భూమి కేటాయించండి. జాగ కేటాయిస్తే.. భవనం నిర్మించుకుంటాం’ అని రాజకీయ పార్టీలు అభ్యర్థిస్తున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఆఫీసులకు జిల్లాలో ఎకరం చొప్పున కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వారం రోజుల క్రితం జరిగిన కేబినెట్లో జిల్లాకో గులాబీ భవన్‌కు ఎకరం భూమిని కేటాయించిన సర్కారు.. ఇతర పార్టీలకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. గజానికి రూ.వెయ్యి చొప్పున స్థలాలను బదలాయిస్తామని స్పష్టం చేసింది. ఇదే అదనుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి గురువారం డీఆర్ఓ స్వర్ణలతను కలిసి భూమిని కేటాయించాలని కోరారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కూడా కలెక్టర్ రఘునందన్‌రావును ఇదే విషయమై సంప్రదించారు. నూతన కార్యాలయం నిర్మించుకునేందుకు జిల్లా కేంద్రం సమీపంలో ఎకరం భూమిని కేటాయించాలని ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వాస్తవానికి గతంలో టీడీపీకి ఎల్బీనగర్లో పార్టీ ఆఫీసు కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విలువైన స్థలాన్ని కేటాయించింది. దీంట్లో పార్టీ కార్యాలయం నిర్మించకపోగా.. అన్యాక్రాంతమైంది. మరోవైపు ఇటీవల శంషాబాద్‌లో సొంత వనరులతో భూమిని సేకరించిన బీజేపీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. ఇక ఉభయ కమ్యూనిస్టులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొలువుదీరారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వామపక్షాలు, వైఎస్సార్ సీపీ, బీజేపీ కూడా స్థలం కోసం కలెక్టరేట్ బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఇది ఒక రకంగా జిల్లా యంత్రాంగానికి తలనొప్పి కలిగించే అంశం. భూముల విలువలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కనీస ధరలకు ఎకరం భూమిని కేటాయించాలనే నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. -
అప్పుడే టికెట్ల గొడవ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి తారాస్థాయికి చేరింది.నియోజకవర్గస్థాయి రాజకీయాలు చినికి చినికి గాలివానలా మారి గాంధీభవన్‌కు చేరాయి. ఎన్నికలకు ఏడాది ముందే వర్గ కుమ్ము లాటలు జోరందుకున్నాయి. నేతల మధ్య సిగపట్లు ఆ పార్టీని అంతర్గతంగా కుదిపేస్తున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంతో రగిలిపోతున్న వైరివర్గం నాయకులు గాంధీభవన్ వద్ద పంచాయతీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ క్యామ మల్లేషే బరిలో ఉంటారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించినట్లు వార్తలు రావడంతో.. ఇదే సీటును ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డిలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మల్రెడ్డి సోదరులు, అనుచరులు కార్యకర్తలను తప్పుదోవ పట్టించేలా పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై తాడోపేడో తేల్చుకోవాలని అనుచరవర్గంతో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఈ పరిణామంతో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇటీవల ప్రకటనపై వాకబు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి క్యామ మల్లేష్ అభ్యర్థిత్వమే కారణమని, మరోసారి అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారు. టికెట్టుపై కార్యకర్తల్లో అయోమయం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ మాత్రం గెలుపుగుర్రాలకే సీటు కేటాయిస్తామని, టికెట్ల ఖరారు వ్యవహారంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఇతర పార్టీల నేతలు కొందరు పార్టీలో చేరిన సమయంలో అన్యాపదేశంగా క్యామకు టికెట్ అన్నానే తప్ప... ఖరారైందని తాను అనలేదని ఉత్తమ్ మల్రెడ్డి వర్గీయులతో అన్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఉప్పు..నిప్పులా ఉన్న పట్నం రాజకీయాలు తాజా పరిణామాలతో మరింత చిటపటలాడుతున్నాయి. క్యామ వల్లే భువనగిరిలో ఓడిపోయాం: మల్రెడ్డి ఓడిపోయేవారికి టికెట్లు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టికెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారని, మల్లేష్ మాత్రం టికెట్ వచ్చిన్నట్టు అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. క్యామ మల్లేష్‌కు ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక పట్నం టికెట్ ఇచ్చి ఉంటే.. భువనగిరి పార్లమెంటు సీటు గెలిచే వాళ్లమని చెప్పారు. అధిష్టానం మాటే శిరోధార్యం : క్యామ మల్లేశ్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. గెలుపోటములకు అతీతంగా పార్టీ కోసమే పనిచేస్తున్నా. పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. మల్రెడ్డి సోదరులు కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. అధికారం పోగానే కనుమరుగైన నేతలు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో కార్యకర్తలకు తెలుసు. ఎన్నడు కూడా ఏఐసీసీ, పీసీసీ నేతలను గౌరవించలేదు. స్థానికంగా వేసిన ఫ్లెక్సీల్లో కూడా నేతలను విస్మరించారు. నాకు టికెట్ ఇవ్వనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా ఖండించలేదు. వీరే కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారు. -
‘అందువల్లే 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది’
హైదరాబాద్ : గత ఎన్నికల్లో ఓడిపోయేవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్లే..కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా పీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం టిక్కెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారని, మల్లేష్ మాత్రం టిక్కెట్ వచిన్నట్టుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఆర్ కుంతియాను కలిసి చెప్పామని అన్నారు. ఇది కేవలం మనవి మాత్రమేనని స్పష్టం చేశారు. పీసీసీ దృష్టికి కార్యకర్తల మనోభావాలు తీసుకు వచ్చామని తెలిపారు. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇచ్చి ఉంటే..భువనగిరి పార్లమెంటు గెలిచే వాళ్లమని జోస్యం చెప్పారు. క్యామమల్లేశ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బదనాం చేస్తున్నాడని ఆరోపించారు. -
పట్నం టికెట్ క్యామకే
యాచారం(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్.. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కే ఇస్తామని, అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాచారం మండల పరిధిలోని మాల్ సర్పంచ్ చిన్నోళ్ల పద్మజ(టీఆర్ఎస్)తో పాటు పలువురు వార్డు సభ్యులు, 150 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో పాటు అన్ని వర్గాల వారిని మోసం చేశారని మండిపడ్డారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేలు దీన్ని ధ్రువీకరించాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కూడా 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, బహిష్కరణలకు గురైన వారితో చర్చించి సస్పెన్షన్ ఎత్తేసే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన ప్రతీ నాయకుడిని, కార్యకర్తను మళ్లీ ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పడకంటి శేఖర్‌గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేశ్, ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్ఛ భాషా, నాయకలు ఆడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఠ’ముడి!
సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా అధ్యక్ష పీఠంపై కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం జరుగుతోంది. అధిష్టానం అండదండలతో పార్టీ పగ్గాలు చేజిక్కించుకునే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడడంతో నైతిక బాధ్యత వహిస్తూ డీసీసీ అధ్యక్ష పదవికి క్యామ మల్లేశ్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆమోదం విషయంలో సస్పెన్స్ వీడకముందే.. కుర్చీ కోసం కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు తెరలేచింది. కేవలం 18 నెలల పాటు అధ్యక్షుడిగా పనిచేసిందున మల్లేశ్‌నే తిరిగి కొనసాగించాలని మెజార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండగా, స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నందున తమకు చాన్స్ ఇవ్వాలని మరోవర్గం పట్టుబడుతోంది. మల్లేశ్‌కు మద్దతుగా సంతకాల సేకరణ సారథి ఖరారు జిల్లా కాంగ్రెస్‌లో సరికొత్త చర్చకు తెరలేపింది. మల్లేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ముఖ్యనేతలంతా ఏకతాటి మీద నిలిచారు. ఎడముఖం.. పెడముఖంగా ఉండే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ కూడా ఆయనకు అండగా నిలిచారు. ఈ మేరకు మల్లేశ్‌ను కొనసాగించాలని కోరుతూ అధిష్టానానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పార్టీ నేతలు కేఎల్లార్, సుధీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్, నారాయణరావు, బండారి రాజిరెడ్డి, భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలంగౌడ్ కూడా మల్లేశ్ మద్దతుగా లేఖ రాశారు. జిల్లాలో పార్టీ సమన్వయంతో పనిచేస్తోందని, ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసిందని గుర్తు చేశారు. కేవలం జీహెచ్ఎంసీలో ఓటమికి మల్లేశ్‌ను బలి చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ముందు కుండబద్దలు కొట్టారు. ఓటమిని సాకుగా చూపి మల్లేశ్‌ను తప్పించాలని చూస్తే వరంగల్, గ్రేటర్, నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేతలందరికీ ఉద్వాసన పలకాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మల్లేశ్ రాజీనామా ఆమోదించే అంశంపై అధిష్టానం డైల మాలో పడినట్లు తెలుస్తోంది. మెజార్టీ సీనియర్లు మల్లేశ్‌కు మద్దతు ఇస్తున్నందున.. రాజీనామా అంశంపై అచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మాకు ఛాన్సివ్వండి ఓటమిని అంగీకరిస్తూ మల్లేశే రాజీనామా చేసినందున.. ఆయనకు మళ్లీ అవకాశం కల్పించాలనే వాదన అర్థరహితమని మరో వర్గం అంటోంది. మల్లేశ్‌ను తప్పించడం ఖాయమైనందున సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పేరను పరిశీలించాలని ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుని అనుభవ జ్ఞుడైన చంద్రశేఖర్‌కు పగ్గాలు అప్పగించడం సముచితమని ఇటీవల దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టం చేశారు. కాగా, చంద్రశేఖర్ నాయకత్వాన్ని మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్‌కుమార్‌లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి కూడా డీసీసీ పీఠంపై కన్నేశారు. తన మనసులోని మాటను డిగ్గీ చెవిన వేశారు. దిగ్విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు తనకు కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులోపు కొత్త సారథులను ఖరారు చేస్తామని డి గ్గీరాజా స్పష్టం చేసినందున ఆశావహులు ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు.. సొంతపార్టీలో వ్యతిరేకవర్గాన్ని బలహీన పరిచే దిశగా వ్యూహారచన చేస్తున్నారు. -
ముచ్చర్లలో ‘ఫార్మా’ సరికాదు
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం: ముచ్చర్లలో ఫార్మా పరిశ్రమ నెలకొల్పడం వల్ల ఇక్కడి ప్రశాంతమైన పర్యావరణానికి పెనుప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీరిస్ పరిశ్రమ నెలకొల్పడం మూలంగా రంగారెడ్డి జిల్లాలోని జీటిమెట్ల, సరూర్‌నగర్ మండలాల్లో ఇప్పటికే వాతావరణ కాలుష్యం ఏర్పడిందని, ఎంతో మంది ప్రజలు ఫ్లోరైడ్‌బారిన పడి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై ఎక్కడా మాట్లాడని ముఖ్యమంత్రి.. పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలు, పర్యటనలతో నిరుద్యోగ యువతను భ్రమల్లోకి నెడుతున్నారన్నారు. ఎంతోమంది యువకుల బలిదానాలకు చలించి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, విద్యార్ధుల బలిదానాలను, మేధావుల పోరాటాలను అపహాస్యం చేస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలు విసుగెత్తి పోతున్నారని, గతంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని వెల్లడించారు. -
సోనియా చలవతోనే తెలంగాణ
ఘట్కేసర్ టౌన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఇంటి పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సర్వేలపేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు ఎత్తివేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పార్టీల అభివృద్ధి కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం్య మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్షా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని హామీలిచ్చి 170 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేశారని, 2000లకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, బాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కొంతం రాంరెడ్డి, బీసీ సెల్ కార్యదర్శి వేముల సత్తయ్యగౌడ్, పీసీసీ కార్యదర్శి మందాడి సురేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గ్యారలక్ష్మాయ్య, సర్పంచ్‌లు అబ్బసాని యాదగిరియాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సభలో రసాభాస.. మండల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. మాజీ జెడ్పీటీసీ రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సభలో తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే పార్టీ కోసం పనిచేసేవారికి అవకాశం ఇస్తామని, పార్టీ బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి సభలో మాట్లడటానికి అవకాశం లేదని కేఎల్లార్ చెప్పారు. దీంతో సభలో గందళరగోళం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కల్పించుకొని వారిరువురికి సభ్యత్వం ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. -
తెలంగాణ ఉనికికి పోరాటమే శరణ్యం
డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ ధ్వజం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమించిన కవులు, విద్యార్థులు, మేధావులు... ఇప్పుడు తెలంగాణ ఉనికిని కాపాడుకునేందుకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఐదు నెలలుగా ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం గందరగోళంలోకి నెడుతోందని విమర్శించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలు విధించడంతో వృద్ధులు, పేదలు నానాయాతనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ప్రతిపక్షాల పోరాటానికి ప్రజాసంఘాలు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.హిట్లర్ పాలనను తలపించేలా రోజుకో సర్వేతో సంక్షేమ పథకాల అమలును కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రమదానంతో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, ఇందిరాపార్కులో సరస్సు నిర్మాణం అంటూ మతిభ్రమించినట్లు సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అనతికాలంలోనే అపఖ్యాతిని మూటగట్టుకుంటోందని అన్నారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి పశుసంపద కబేళాకు తరలుతోందన్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దురదృష్టకరమన్నారు. రుణమాఫీ వర్తింపులేక, రుణాలు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికే జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్టం సాధిస్తే ఉద్యోగాలు దక్కుతాయని ఆత్మబలిదానాలు చేసుకున్న యువత ఆకాంక్షలను కూడా ప్రభుత్వం నెరవేర్చడంలేదని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటనలు కూడా చేయకపోవడంతో నిరుద్యోగులు నైరాశ్యంలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. -
కేసీఆర్ ప్రభుత్వం మునిగే నావ
పరిగి: కేసీఆర్ ప్రభుత్వం మునిగే నావ అని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ విమర్శించారు. పరిగిలో శనివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లటాడుతూ కేసీఆర్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రజలకు, నాయకులకు ఆయన కల్లబొల్లిమాటలు అర్థమవుతాయన్నారు. వైఎస్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమానికి కోత విధించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వే వరకు వచ్చేందుకు ఎంతో కృషిచేశానని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో జిల్లా సశ్యశ్యామలమవుతుందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విధంగా కృషిచేస్తానని తెలిపారు. నంచర్ల-పరిగి రోడ్డు డబుల్ రోడ్డుగా, హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు ఫోర్ లేన్లుగా మార్చేందుకు కృషిచేస్తానన్నారు. జిల్లాలోనే అత్యధికంగా పరిగిలో సభ్యత్వ నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గండేడ్ ఎంపీపీ శాంతబాయి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు కంకల్ వెంకటేశం, బీంరెడ్డి, నారాయణ్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్య, సుభానయ్య, అషఫ్,్ర రవీంద్ర, రాధారెడ్డి, గోపాల్, కృష్ణ, నరేందర్‌యాదవ్, రామకృష్ణారెడ్డి, భరత్‌రెడ్డి, మేఘమాల తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డులు తొలగిస్తే ఉద్యమిస్తాం
ఇబ్రహీంపట్నం: సర్వేల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదల రేషన్‌కార్డులను తొలగిస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ హెచ్చరించా రు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఇప్ప టి వరకు ఒక్కటికూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఓ వైపు రైతు లు ఇబ్బందులు పడుతుంటే.. రుణమాఫీ పై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దోబూచులాడుతోందని విమర్శించారు. పారిశ్రామిక విధానంపై రోజుకో ప్రకటన చేస్తోందని.. కార్యాచరణ మాత్రం ఎక్కడా కనిపిం చడంలేదన్నారు. సకాలంలో వర్షాలు కురవక జిల్లా తూర్పు డివిజన్లో అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, పెట్టుబడులు సైతం చేతికందని పరిస్థితి తలెత్తిందన్నారు. పశువులకు గ్రాసంకూడా అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ఎంపీపీ డోకూరి వెంకట్రాం రెడ్డి, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్‌ఖాన్, చర్లపటేల్‌గూడ ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మయ్యయాదవ్, ఆనంద్ పాల్గొన్నారు. -
దళితులపై కాంగ్రెస్ వివక్ష
చేవెళ్ల రూరల్: కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దళితుల పట్ల వివక్షత చూపిస్తోందని. తనను పదవి నుంచి నెల కాలంలో రెండు సార్లు తొలగించటాన్ని బట్టే ఇది తెలుస్తోందని తాజామాజీ డీసీసీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి అన్నారు. ‘జిల్లా డీసీసీ అధ్యక్షుడి మార్పు, క్యామ మల్లేశ్ నియమాకం’ అని మీడియాలో వార్తలు రావటం చూసిన ఆయన చేవెళ్లలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య దళితులపట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. తనకు ఎందుకు పదవిని కట్టబెట్టారు.... ఎందుకు తొలగిస్తున్నారో కనీసం సమాచారం ఇవ్వకుండా వారికిఇష్టం వచ్చిన వారికి పదవిని కట్టబెట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు. ఒక దళితునిగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే తనను తప్పించి క్యామ మల్లేశ్‌ని తిరిగి నియమించటం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితుడినని, డబ్బులు లేవనే తనను ఇలా తొలగించి డబ్బులు ముట్ట జెప్పిన మల్లేశ్‌కు డీసీసీ పదవీని ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది దళితులకు పార్టీ చేస్తున్న అన్యాయమేనన్నారు. పార్టీకోసం గత 30ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నాటినుంచి కేంద్ర కాంగ్రెస్‌పార్టీ దళితులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిందని, ఈనాడు సోనియా గాంధీకూడా దళితులకు న్యాయం చేస్తుంటే రాష్ట్ర నాయకులు దీనిని దిగజారుస్తున్నారన్నారు. తనకు అన్యాయం చేసిన పీపీసీ అధ్యక్షుడు దళితుల వద్దకు ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని, పార్టీ మారకూడదని బుజ్జగించి డీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చిన పొన్నల లక్ష్మయ్యే ఇప్పుడు తనను ఆ పదవి నుంచి ఎందుకు తప్పిస్తున్నారో చెప్పాలన్నారు. ఏప్రిల్ 17న డీసీసీ పదవిని ఇచ్చి ఆగస్టు 22న తనన మార్చి మళ్లీ క్యామ మల్లేశ్‌కు ఇచ్చినట్లు వార్తలు వస్తే వెంటనే అప్పుడు నాయకులు కలుగ జేసుకొని మేథోమథన సదస్సు ఉందని దానిని అప్పటివరకు నిలిపి వేశారు. మళ్లీ నెల రోజులు గడిచిన వెంటనే మళ్లీ అధ్యక్షుడి మార్పు చేయటం సిగ్గు చేటు అన్నారు. దీన్ని గురిం చి మాజీ హోం మంత్రి సబితారెడ్డికి ఫొన్‌చేసి అడిగితే టీపీసీసీతో మాట్లాడుతానని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీలు, గుండాలు, డబ్బులు ఉన్నవారిదే రాజ కీయం నడుస్తోందన్నారు. తాను ప్రజల మనిషిగా ఉం టానని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉం డాలని నిర్ణయించుకుంటున్న ట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. -
క్యామకే డీసీసీ పగ్గాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను క్యామ మల్లేశ్‌కే కట్టబెడుతూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితమే మల్లేశ్‌కు పగ్గాలు అప్పగిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అయితే, ఈ నియామకంపై పార్టీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా పోస్టింగ్‌ను పెండింగ్‌లో పెట్టిన హైకమాండ్.. మల్లేశ్ కే అధ్యక్షపీఠం కట్టబెడుతూ బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులిచ్చారు. ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షుడిగా క్యామ పనిచేశారు. అయితే, జోడు పదవుల అంశం తెరమీదకు రావడంతో మల్లేశ్ స్థానే పడాల వెంకటస్వామిని నియమించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్గీయుడిగా పేరున్న వెంకటస్వామి చేవెళ్ల అసెంబ్లీ స్థానాన్ని ఆశించి భ ంగపడ్డారు. ఈ క్రమంలో డీసీసీ పదవితో ఆయనను సంతృప్తి పరిచారు. ఆ తర్వాత, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో భాగంగా నెల రోజుల క్రితం తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను మార్పు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఎకాఎకిన పడాలను పార్టీ పదవి నుంచి త ప్పిస్తూ క్యామకు అప్పగించ డాన్ని జీర్ణించుకోలేని ఆయన వైరివర్గం... ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసింది. మల్లేశ్ నియామకాన్ని అపకపోతే తాడో పేడో తేల్చుకుంటామని మాజీ మంత్రి సబిత వర్గీయులు పీసీసీకి అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలుండడం, అవి కూడా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతుండడంతో ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని భావించిన ఏఐసీసీ పెద్దలు నియామకాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ క్రమంలోనే ఈ నియామకాలు ఆగిపోయినట్లేనని భావించిన మల్లేశ్ వ్యతిరేకవర్గానికి పీసీసీ తాజా నిర్ణయం షాక్ ఇచ్చింది. పడాలను తప్పించడం ఒక ఎత్తయితే... తమకు పొసగని క్యామకే తిరిగి డీసీసీ కళ్లెం ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిభారంతో కుంగిపోతున్న తమకు పార్టీలో అసమ్మతి రాజకీయాలను పెంచి పోషించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వాపోతున్నారు. మ రోవైపు, తనపట్ల పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించిందని కలత చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట స్వామి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కలుషిత రాజకీయాల్లో తనలాంటి వారికి స్థానంలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... రాజకీయాలకు దూరమైనా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ధనస్వామ్యం పెరిగిపోయిందని, రౌడీలు, గూండాలకే పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని, దళితులకు గౌరవంలేదని వాపోయారు. -
మళ్లీ మల్లేశ్‌కే డీసీసీ పగ్గాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సారథిగా క్యామ మల్లేశ్ మరోసారి నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ గురువారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన మల్లేశ్‌ను జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ నుంచి తప్పించింది. దీంతో చేవెళ్ల టికెట్‌ను ఆశించి భంగపడ్డ పడాల వెంకటస్వామికి ఎన్నికల వేళ ఈ పదవిని కట్టబెట్టారు. ఎన్నికలు పూర్తికావడం... పార్టీ ఘోరపరాజయం చ విచూసిన నేపథ్యంలో పడాలకు ఉద్వాసన పలికి, తిరిగి క్యామకే డీసీసీ పగ్గాలను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందూ కాలేజీలో ‘మేధోమథనం’ సదస్సును నిర్వహిస్తుండడం... అతిరథమహారథులు వస్తున్న ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించిన పీసీసీ... సీనియర్ అయిన మల్లేశ్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించేందుకు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై ఆందోళనలు చేస్తామని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని క్యామ అన్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారపార్టీకి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పార్టీకి పూర్వవైభవం తె చ్చేందుకు, సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు త్వరలోనే జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తానని, ముఖ్యనేతల సలహాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. -
సారథుల సమరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.. మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు.. ఇంకొకరు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్.. ఈ ముగ్గురు ఒకే స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే.. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇబ్రహీంపట్నంలో నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన జిల్లా బాధ్యులు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కూడా అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరగణంతో నామినేషన్ సమర్పించారు. ఈ ముగ్గు రు నేతలు కూడా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వారే కావడం విశేషం. ప్రధానంగా పోటీ కూడా ఈ ముగ్గురి మధ్యే నెలకొంది. మొత్తంగా పార్టీ జిల్లా సారథులు ముగ్గురూ ఒకే సీటుకోసం పోటీపడుతుండడంతో స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. అంతిమంగా గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
అగ్నిపరీక్ష!
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రాబోయే ఎన్నికల్లో సొంత గడ్డపై తమ పార్టీలను గెలిపించుకోవడం జిల్లాలో ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిలో ఒకరు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కాగా మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ‘పట్నం’ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. మండల పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన మల్లేశ్ ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కాగా, ఎలిమినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ ఒకే మండలానికి చెందిన నేతలు కావడం, పార్టీల్లో కీలక పదవుల్లో ఉండడంతో వచ్చే ఎన్నికలు వారికి అగ్నిపరీక్షగా నిలిచాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన బాధ్యత కూడా వారిపై పడింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌ను మల్లేశ్ ఆశిస్తుండగా, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కిషన్‌రెడ్డి తిరిగి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వారికి సవాల్‌గా మారాయి. గెలుపుపై దృష్టి.. నియోజకవర్గంలోని హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో అత్యధిక ఎంపీపీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ద్వారా తమ సత్తా చాటుకోవాలని ఇద్దరు నేతలు తహతహలాడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములు వచ్చే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుండడంతో తమ పార్టీలను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత వారిపై పడింది. 2006 ఎన్నికల్లో హయత్‌నగర్, యాచారం ఎంపీపీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇబ్రహీంపట్నం, మంచాల ఎంపీపీలను టీడీపీ దక్కించుకుంది. జెడ్పీటీసీల విషయానికొస్తే హయత్‌నగర్, యాచారం, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మంచాల జెడ్పీటీసీని సీపీఎం కైవసం చేసుకుంది. ప్రస్తుతం మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా అత్యధిక స్థానాలను తమ పార్టీలకు గెలిపించుకోవాలని ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా వచ్చే నగర పంచాయతీ ఎన్నికలు ఇద్దరూ దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీలు ఇటీవలే ఆవిర్భవించాయి. ఈ రెండు నగర పంచాయతీల చైర్మన్ పదవులు ఎస్సీ జనరల్‌కు రిజర్వ అయ్యాయి. సెమీఫైనల్ లాంటి ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరిగే నగర పంచాయతీ ఎన్నికలు ఇద్దరు నేతల సామర్థ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి. -
‘పాదయాత్ర’ లొల్లి!
యాచారం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోమారు బయటపడ్డాయి. శుక్రవారం యాచారం మండలం గునుగల్లో చేపట్టిన యువజన కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వస్తున్నట్లు యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సిద్దంకి కృష్ణారెడ్డి గురువారమే పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు. అయితే శుక్రవారం ఉదయం కృష్ణారెడ్డి తదితరులు గునుకుల్కు రాకముందే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంకాల దాసు, హయత్‌నగర్ మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డిలు పాదయాత్రను ప్రారంభించేశారు. పాదయాత్ర గునుగల్ గేట్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకోగానే క్యామ మల్లేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దంకి రజితారెడ్డి తదితరులు వారికి ఎదురుపడ్డారు. ఈ క్రమంలో యువజన కాంగ్రెస్‌లో క్యామ మల్లేష్ వర్గానికి చెందిన కొందరు మరోమారు పాదయాత్రను ప్రారంభించాలని కోరడంతో మళ్లీ ప్రారంభించారు. దీంతో రెండు వర్గాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు అర కిలోమీటర్ తేడాతో పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు ఏ గ్రూపులో ఉండి నడవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. మల్రెడ్డి రాంరెడ్డి ప్రారంభించిన పాదయాత్రలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వెంకట్‌రెడ్డి, మంకాల దాసు, గునుగల్ సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్ తదితరులు పాల్గొనగా, క్యామ మల్లేష్ ప్రారంభించిన పాదయాత్రలో డీసీసీ ప్రధాన కార్యదర్శి దెంది రాంరెడ్డి, గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్, గునుగల్, యాచారం, నక్కర్తమేడిపల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్నా: రజితారెడ్డి మహిళల కోటాలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దంకి రజితారెడ్డి వెల్లడించారు. రాహుల్ గాంధీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి సూచనల మేరకే పాదయాత్ర చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో సిద్దంకి కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనువాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, యాలల యాదయ్య, కుంటి నర్సింహ, కన్నరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పదవి కాదు.. పనిచేయడం గొప్ప
తాండూరు, న్యూస్‌లైన్: పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తిస్తుందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ పేర్కొన్నారు. తాండూరులో శనివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పాటుపడాలన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కంకబద్ధులై పనిచేయాలన్నారు. పదవి వచ్చిందని చెప్పుకోవడం గొప్ప కాదని, అది బాధ్యతగా గుర్తించి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ నిజమైన తెలంగాణ తల్లి అని అన్నారు. పార్టీ పటిష్టానికి త్వరలో మండలాల వారీగా పర్యటిస్తానని చెప్పారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు మంత్రి ప్రసాద్‌కుమార్ అధికారులతో సమీక్షించారన్నారు. ప్రభుత్వం రైతులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. రింగు రోడ్డు వద్ద పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను విస్మరించొద్దన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ఆర్, ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అపూ, నాయకులు శ్రీనివాసాచారి, బస్వరాజ్, సీసీఐ రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, నీలకంఠం, ప్రభాకర్‌గౌడ్, హేమంత్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్, రియాజ్, సంతోష్‌గౌడ్, ముజీబ్, ఫిరోజ్‌ఖాన్, రత్నం, హరిగౌడ్, ఎస్పీ రవి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.