కేసీఆర్ ప్రభుత్వం మునిగే నావ
పరిగి: కేసీఆర్ ప్రభుత్వం మునిగే నావ అని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ విమర్శించారు. పరిగిలో శనివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లటాడుతూ కేసీఆర్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రజలకు, నాయకులకు ఆయన కల్లబొల్లిమాటలు అర్థమవుతాయన్నారు. వైఎస్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమానికి కోత విధించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వే వరకు వచ్చేందుకు ఎంతో కృషిచేశానని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో జిల్లా సశ్యశ్యామలమవుతుందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విధంగా కృషిచేస్తానని తెలిపారు. నంచర్ల-పరిగి రోడ్డు డబుల్ రోడ్డుగా, హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు ఫోర్ లేన్లుగా మార్చేందుకు కృషిచేస్తానన్నారు. జిల్లాలోనే అత్యధికంగా పరిగిలో సభ్యత్వ నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గండేడ్ ఎంపీపీ శాంతబాయి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు కంకల్ వెంకటేశం, బీంరెడ్డి, నారాయణ్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వెంకటయ్య, సుభానయ్య, అషఫ్,్ర రవీంద్ర, రాధారెడ్డి, గోపాల్, కృష్ణ, నరేందర్‌యాదవ్, రామకృష్ణారెడ్డి, భరత్‌రెడ్డి, మేఘమాల తదితరులు పాల్గొన్నారు.