t.ramohan reddy
-
కేసీఆర్ ప్రభుత్వం మునిగే నావ
పరిగి: కేసీఆర్ ప్రభుత్వం మునిగే నావ అని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ విమర్శించారు. పరిగిలో శనివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లటాడుతూ కేసీఆర్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రజలకు, నాయకులకు ఆయన కల్లబొల్లిమాటలు అర్థమవుతాయన్నారు. వైఎస్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమానికి కోత విధించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వే వరకు వచ్చేందుకు ఎంతో కృషిచేశానని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో జిల్లా సశ్యశ్యామలమవుతుందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విధంగా కృషిచేస్తానని తెలిపారు. నంచర్ల-పరిగి రోడ్డు డబుల్ రోడ్డుగా, హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు ఫోర్ లేన్లుగా మార్చేందుకు కృషిచేస్తానన్నారు. జిల్లాలోనే అత్యధికంగా పరిగిలో సభ్యత్వ నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గండేడ్ ఎంపీపీ శాంతబాయి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు కంకల్ వెంకటేశం, బీంరెడ్డి, నారాయణ్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్య, సుభానయ్య, అషఫ్,్ర రవీంద్ర, రాధారెడ్డి, గోపాల్, కృష్ణ, నరేందర్‌యాదవ్, రామకృష్ణారెడ్డి, భరత్‌రెడ్డి, మేఘమాల తదితరులు పాల్గొన్నారు. -
15 ఏళ్లుగా ప్రతిపక్షమే..!
కుల్కచర్ల, న్యూస్‌లైన్: మరోసారి పరిగి ఓటర్లు రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నమైన తీర్పునిచ్చారు. గత 15 సంవత్సరాలుగా పరిగి శాసన సభ్యుడు ప్రతిపక్షానికే పరిమితమవుతున్నాడు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డిని గెలిపించి ఓటర్లు అదే తీర్పును పునరావృతం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీచినా పరిగి నియెజకవర్గం ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఈసారి సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. నియెజవర్గంలో ఐదు మండలాలు దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ఓటు వేసి ఉంటారని, హరీశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చి అందరికీ షాకినిచ్చాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉంది. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. అయితే సార్వత్రికానికి వచ్చే సరికి తీర్పు మారడంతో టీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. అయితే వరుసగా ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డికే అవకాశం ఇవ్వడంతో ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఆర్ గెలవగా హరీశ్వర్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని, కనీసం ఈసారైనా నియోజకవర్గానికి న్యాయం జరిగి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్‌ఆర్‌ను ఆ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆయన్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.