సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణాంతకమైన ‘కోవిడ్–19’ వైరస్ భయాందోళనలకు గురిచేస్తుంటే, దానిపై రాజకీయ నాయకుల నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకు తెలిసీ తెలియక ఛలోక్తులు విసురుతున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయమై కొంతమంది తాము గుడ్డిగా నమ్ముతున్న సూచనలు చేస్తుంటే, మరి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఛలోక్తులు విసురుతున్నారు. అందరి సూచనలు అన్నీ నిజం కాకపోయినా కొందరి సూచినల్లో కొన్నైనా అర్ధ సత్యాలు లేకపోలేదు. ఏది ఏమైనా వారి సూచనలు, వ్యాఖ్యలు, ఛలోక్తులు భయాందోళనల మధ్య ప్రజలకు కాస్త ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.