వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. అక్కడి నుంచి నెట్టేరు, పాలవలస, సీతమ్మపాలెం, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్ రోడ్డు, తర్లువాడ, బాకురుపాలెం క్రాస్ రోడ్డు మీదుగా ముచ్చెర్ల క్రాస్ రోడ్డు వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.
265వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
Published Tue, Sep 18 2018 10:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement