ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. త్వరలో గడువు ముగుస్తున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.