ఈసీ వెల్లడించకముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బయటపెట్టిన బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ విషయమై దర్యాప్తు జరిపేందుకు అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటుచేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని ఈసీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘంలోని సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేశామని, దీనిపై ఏడురోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.