నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం | Farmer Suicide Attempt At Kondamallepally Market Yard In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం

Published Thu, May 16 2019 8:28 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మార్కెట్‌ యార్డులో గురువారం జరిగింది. హకుల్‌ అనే రైతు పదిహేను రోజుల క్రితం వరిధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చాడు. కానీ, తేమ ఉందని చెప్పిన అధికారులు అతని ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారీలు తెచ్చిన ధాన్యాన్ని మాత్రం ఏ అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయడం గమనించిన హకుల్‌ వారితో గొడవకు దిగాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement