దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబైని అగ్నిప్రమాదాలు వీడటం లేదు. కమలా మిల్స్ దుర్ఘటన మరవకముందే తాజాగా దక్షిణ ముంబైలోని పురాతన నవరంగ్ సినిమా స్టూడియోలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పుతున్న సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. కాగా స్టూడియో ఉన్న ఈ భవనం గత 20 ఏళ్లుగా వాడకంలో లేదని, అగ్నిప్రమాదం అయిదో అంతస్తులో జరిగిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్ చౌదరి తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. భవనం శిథిలావస్థలో ఉందని, ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
Published Fri, Jan 19 2018 11:09 AM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
Advertisement